పొట్లూరి వీర వరప్రసాద్ (పీవీపీ) కు సెబీ షాక్…

ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ విజయవాడ పార్లమెంటు అభ్యర్ధి పొట్లూరి వీర వరప్రసాద్‌కు చెందిన పీవీపీ వెంచర్స్ లిమిటెడ్‌ షేర్ల ట్రేడింగ్‌ను సెబీ నేటి నుంచి నిలిపివేసింది.

ఎక్స్ఛేంజ్‌ నిబంధనలకు అనుగుణంగా బకాయిలు చెల్లించడంలో విఫలం కావడంతో…
ఈ రోజు నుంచి పీవీపీ షేర్లలో ఎలాంటి లావాదేవీలు జరగకుండా సెబీ నిషేధం విధించింది…. దీంతో వేలాది మంది పీవీపీ షేర్‌హోల్డర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో పీవీపీ వెంచర్స్ అక్రమాలు ఋజువు కావడంతో… సెబీ 20 కోట్ల రూపాయల పెనాల్టీని విధించింది. అయితే ఎన్ని అవకాశాలిచ్చినా పీవీపీ సంస్థ ఆ బకాయిలను ఇప్పటి వరకు చెల్లించలేకపోయింది.

వరుసగా రెండు త్రైమాసికాలలో తమ నిబంధనలను పీవిపీ సంస్థ అమలు చేయకపోవడంతో ఆ సంస్థ ట్రేడింగ్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. ఇవాళ్టి నుంచి 21రోజుల పాటు ఈ నిషేధం అమలులో ఉంటుంది.

సెబీ నిబంధనలను పాటిస్తామని హామీ పత్రంతో పాటు… జరిమానా మొత్తాన్ని చెల్లిస్తే నిషేధం ఎత్తివేస్తామని సెబీ స్పష్టం చేసింది.

About The Author