జనసేన పార్టీకి హీరో శ్రీ నితిన్ రూ.25 లక్షల విరాళం
యువ కథానాయకుడు శ్రీ నితిన్ జనసేన పార్టీ నిధికి రూ.25 లక్షల విరాళం ఇచ్చారు. సోమవారం రాత్రి భీమవరంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారిని శ్రీ నితిన్ తండ్రి, నిర్మాత శ్రీ ఎన్. సుధాకర్ రెడ్డి కలిసి చెక్ అందచేశారు. డీ హైడ్రేషన్ తో అస్వస్థతకు లోనైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “సోదరుడు నితిన్ నా ఆరోగ్యం గురించి వాకబు చేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో అభిమానంగా జనసేనకు విరాళం పంపించారు. నితిన్ కు, శ్రీ సుధాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు” తెలిపారు.