TDP-YCP ఈ రెండు పార్టీలకి ఓటు వేయచ్చా??
ఓటు వేసేముందు ఐదేళ్ళ పరిణామాలు గుర్తు పెట్టుకోండి
చంద్రబాబు తన TDP వస్తేనే ప్రజలకి మేలు జరుగుతుందనిYCP వస్తే అరాచకం జరుగుతుందని తన అనుకూల మీడియాతో రోజూ పగలు రాత్రి టీవీలలో పత్రికల్లో సోషల్ మీడియాలో చివరకు Youtube లలో కూడా మనల్ని వాయించేస్తున్నారు.. .బాబు రాకపోతే జనాలకి తిండి నీరు కూడా దొరకదని.. ఇంకా ఎక్కువ మట్లాడితే బాత్రూం కూడా రాదని చెపుతూ వారు చేసే ప్రచారం ఒకరకంగా కొందరి ప్రజల్లో జుగుప్స కలిగిస్తుంది.
అయన మళ్ళి రావాలనే ప్రచారం ఒకవైపు మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ అయన ప్రచారం చేసే విధానం నిజంగా ప్రజలకి మేలు చేస్తుందా అని రాయాలని అనిపించి ఎన్నికల ప్రచారం చివరి రోజున ఇది రాస్తున్నాను.
అలాగే YCP-జగన్ కేవలం తానూ ముఖ్యమంత్రి అయితేనే అన్నీ చేస్తానని లేకుంటే ప్రతిపక్ష నాయకుడిగా కూడా తన బాధ్యతని నెరవేర్చకుండా..రోడ్లు పట్టుకొని పాదయాత్ర డ్రామా అనేది కొందరి ప్రజల వాదన…అది వాస్తవం కూడా..
ఈ రెండు పార్టీల విధి విధానాపై కొచెం విపులంగా రాస్తున్నాను..రెండు ప్రజలకి మేలు చేస్తాయా లేక కీడు చేస్తాయా అనేది అలోచించి అప్పుడు ఎవరికీ ఓటు వేయాలో ఆలోచించుకోండి.
చంద్రబాబుకి మళ్ళి ఓటు వేయచ్చా ?
—————————
1995-2003 మధ్య చంద్రబాబు పరిపాలన చుసినవారు అయన పనితీరు నమ్మినవారు మాత్రమే అయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని 2014లో మళ్ళి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు.
కానీ ఈ ఐదేళ్ళు అయన పరిపాలనచూసి ప్రశంశించిన వారికంటే వ్యతిరేకించి విమర్శించినవారే ఎక్కువ.కారణం అయన ప్రవర్తించిన విధానం.ప్రజలకి చేయాల్సిన అంశాల్లో పాటించిన వైఖరి.అవేంటో కింద చూద్దాం.
చంద్రబాబు పరిపాలన ఈ ఐదేళ్ళలో నాలుగున్నఏళ్ళు ఒక ఎత్తు..ఈ ఆరు నెలలు మరో ఎత్తు..
అయన 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మొత్తం నాలుగున్నర ఏళ్ళలో ఏనాడూ గుర్తు రాలేదు.. చివరి ఆరునెలల్లో మాత్రం గుర్తు వచ్చాయి. జనాలని ఎర్రోళ్ళుగా భావించి డబ్బులు ఎరవేసి చేసి ఓట్లని కొనాలని మొదలుపెట్టారు.
అందులో నిరుద్యోగ భ్రుతి వెయ్యితో మొదలుపెట్టి నేడు రెండువేలు చేసారు డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద డబ్బులు..వృద్ధులకి రెండువేలు పెన్షన్స్.రైతులకి చివరి విడత రుణమాఫీ..ఇలా ఎన్నికలు రేపు ఉండగా కూడా డబ్బులు జల్లుతూ ఉన్నారంటే..వీరికి అధికారం అనే దాహానికి ప్రజలని ఎలాగైనా బలి చేస్తారని మరో లక్షకోట్ల అప్పు తెచ్చి జనంపై రుద్దడానికి సిద్దమేనని నాకు స్పష్టంగా అర్ధం అవుతుంది.
చాలామందికి తెలియంది ఏంటంటే.. 1 జూన్ 2019 నాటికి రాష్ట్ర ఖజానాలో పైసా డబ్బు లేదని ఇప్పటికే మూడు లక్షల కోట్ల అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం దానికి సంవత్సరానికి 37వేల కోట్ల వడ్డీలు కట్టే పరిస్థితిలో ఉంటే..2019 జూన్ లో ఏర్పడే కొత్త ప్రభుత్వం చేతిలో
పైసా లేకుండా అడుక్కుంటూ మొదలుపెడుతుంది. ఇప్పటికే కాంట్రాక్టర్లకి చెల్లించాల్సిన డబ్బులు మొత్తం ఆపేసి ఇలా జనాలకి పంచేస్తున్నారు.
నాలుగున్నర ఏళ్ళ పాలన ఒకలా..ఈ ఆరు నెలల్లో చేసిన ఒకలా రెండు భిన్నమైన అత్యంత జుగుప్స కలిగించేలా చేసిన పనులు. ఓటర్లని డబ్బులతో కొనేసారు.ముసలివాళ్ళని పెన్షన్ పేరుతొ ఆడవాళ్ళని డ్వాక్రా పసుపు కుంకుమ పేరుతొ యువతకి నిరుద్యోగ భ్రుతి పేరుతొ..
అన్ని వర్గాల వారికి కార్పొరేషన్ పేరుతొ..ఇలా అడిగిన వాళ్ళకి అడిగినంత ఇస్తాం మాకు ఓటేస్తే చాలు స్వర్గం చూపిస్తాం అంటున్నారు.
ఇక అయన తిట్టినవాడిని తిట్టాలి..మంచివాడు అంటే మంచోడని పొగడాలి..అయన U-Turn తీసుకుంటే మనం తీసుకోవాలి.లేదంటే వారు రాష్ట్ర ద్రోహులు అవుతారు.
దానికి చిన్న ఉదాహరణ.
కొన్ని కేంద్ర పథకాలని తన పధకాలుగా చెపుతారు.లేక కేంద్రం ఇచ్చే నిధులు కూడా తన నిధులుగా చెపుతారు.మోడీ ఇచ్చేది మాత్రం ఎవడబ్బ సొమ్ము అంటారు..అదే ఈయన ఇచ్చే పసుపు కుంకుమలు మాత్రంఈయన సొమ్ములా లేక ఈయన పార్టీ అస్తిలా లేక కార్యకర్తలు ఇచ్చిన సొమ్ములా చెప్పి ప్రచారం చేస్తారు. ఈయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రతి గ్రామంలో శంకుస్థాపన రాయి ఉంటుంది తప్ప అక్కడ దానికి సంబంధించిన పనులు మాత్రం కావని నానుడి.అయన అంత చేస్తాడని ఇంత చేస్తాడని అయన అనుకూల మీడియా ఒకవారం
దానిపై చర్చలు ఆర్భాటం చేస్తూ ఉంటాయి.ఆపై మరొకటి..ఆపై మరొకటి..ఇలా ఐదేళ్ళు ఆ టెంపో మైంటైన్ చేస్తారు.
దానికి ఉదాహరణ..
మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన..ఒక కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన..అబ్బో ఇలా చెప్పుకుంటూ పొతే తల వేడెక్కిపోతుంది.ఇక అయన మొన్నటికి మొన్న ధర్మపోరాట దీక్షలపేరుతొ కేవలం పత్రికలకి టీవీలకి ఇచ్చిన ప్రచారం ఖర్చు 25 కోట్లు.ఇక నవ నిర్మాణ దీక్షలు లసిరికి హారతి ఇలా పదుల సంఖ్యలో జిల్లాల్లో చేసిన పథకాలకి పెట్టిన ప్రచారం పెట్టిన ఖర్చులు కోట్లలోనే..ఎంతో లెక్క లేదు..!!
25 కోట్లు పనికిరాని దీక్షలకి ఖర్చు
అయ్యాయంటే ఎలా ఉంటుంది..ఒకసారి ఊహించండి.
పోనీ మనది ధనిక రాష్ట్రము అయ్యి
ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తే పర్లేదు..
25 కోట్ల డబ్బుతో ఎన్ని గ్రామాలు లేక
ఒక చిన్నపట్టణం అద్భుతంగా తీర్చి దిద్దవచ్చు..!!
.
చంద్రజ్యోతి మీడియాకి ఈ ఐదేళ్ళకి ప్రచారానికి
ఏడు వందల కోట్ల ప్రజాధనం గుమ్మరించిన ఈయనకు
మొత్తం ఐదేళ్ళకి మనకు ప్రకటించిన బడ్జెట్లో–7,07,167
(ఏడు లక్షల ఏడు వేల నూట అరవైఏడు కోట్లు)
దుర్గ గుడి ఫ్లై ఓవర్ కేవలం
180 కోట్ల నిధులు లేక ఆగిందంటే నమ్ముతారా ??
ఏమంటే మోడీ ఇవ్వలేదు..
మరి మీరు ఏమి చేస్తున్నారు ??
ఎందుకు ప్రచారాలకి అర్భాటాలకి తగలేస్తున్నారు ?
గత నాలుగేళ్ళుగా దుర్గ గుడి ఫ్లై ఓవర్ పరిసర
ప్రాంతంలో ప్రజలు ఎలాంటి అవస్థలు పడుతున్నారో
వారిని అడిగితే సమాధానం దొరుకుంది.
ఓహో మీరు ఎండలో వానలో ట్రాఫిక్ లో నిలబడి
ఎప్పుడు ఎదురు చూడరు కదా..మీకు ఎలా తెలుస్తుందిలే ?
.
రాష్ట్రానికి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలని
ఎన్నుకుంటే ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేకపోయారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయేషా మీరాకి న్యాయం చేయాలనీ
CBI విచారణ చేయాలనీ YSR నిలదీసి అడిగిన మీరు
ముఖ్యమంత్రి అయ్యాక కోర్టు స్వయంగా CBI విచారణ
అడిగేవరకు ఆ కేసుని పక్కన పెట్టారు..?
దేనికి నమ్మాలి ఎందుకు నమ్మాలి మిమ్మల్ని ?
ఇక ఒక రితికేస్వరి..ఒక MRO వనజాక్షి..
విశాఖలో జరిగిన లావణ్య కేసు..
ఇలా మహిళలపై సాక్షాత్తు అధికారుల MLA
మంత్రుల అండదండలు వారి జులుం మరువగలమా ?
అత్యంత నిజాయితీపరుడైన IPS అధికారిగా
రవాణాశాఖ కమిషనర్ గా ఉన్న బాలసుబ్రహ్మణ్యంపై
బొండా ఉమ,కేసినాని చేసిన దౌర్జన్యం ఆపై మీరు
వారిని క్షమాపణ కోరమనడం మరువగలమా ?
దేనికి మీరు మళ్ళి రావాలి ?
.
26 ఫిబ్రవరి 2016 లో ప్రభుత్వం
ఎంతో ఘనంగా 600 కోట్ల రూపాయల ఆదాయం
వచ్చే ఇసుకని ఉచితంగా ఇస్తున్నాం అని గర్వంగా చెప్పి
దానిని మరింత అక్రమంగా తరలించి రేటు పెంచి
అమ్మే వైనం ప్రజలు ఎలా మరచిపోతారు..?
కృష్ణా,గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు
చేయకూడదని కోర్టు తీర్పు ఉన్నా అది కూడా
సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇంటి వెనక ఇసుక తవ్వుతున్నారని
చెప్పినా లెక్క చేయకుండా అక్రమార్కులకి అండగా ఉంటే
జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మీకు మొన్ననే వందకోట్ల జరిమానా
వేసినందుకు గర్వపడాలా..లేక సిగ్గు పడాలా..?
దేనికి మీరు మళ్ళి రావాలి..?
.
ఇక 21 ఏప్రిల్ 2017 నాడు చిత్తూరు జిల్లా ఏర్పేడులో
ఇసుక అక్రమ రవాణా ప్రమాదంలో 17 మంది
మరణించిన ఘటన అంత త్వరగా మరచిపోయే కాదు..
ఈ ఇసుక వ్యాపారంలో ఉన్న
అక్రమానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
మరి ఈ అక్రమాల్ని అరికట్టకుండా మీకు ఎందుకు ఓటు వేయాలి??
.
MLA బోండా ఉమ విజయవాడలో చేసిన
భూ అక్రమాలు దౌర్జన్యాలు కావచ్చు..
ప్రజలని పిచ్చి ముండాకొడకల్లారా అని ప్రేమతో
తిట్టే మరో MLA&విప్ చింతమనేని గారు
ప్రజల పట్ల చూపే ఆదరణ గురించి ఆ సంఘటనలు లెక్కే లేదు
ఇలాంటి వారిపట్ల తమరు మాత్రం
తరచూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు
మీ అనుకూల మీడియాలో వస్తుంది.
అలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు రెండోరోజు
మరోచోట వారు అదే పనిచేస్తూ దొరుకుతారు.
మళ్ళి మీరు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వస్తుంది.
ఇదేగా మా భవిస్యత్తు మీ బాధ్యత అని చెప్పేది.
.
ఇక రాజధాని అంశంలో
అన్ని తాత్కాలిక కట్టడాలు అంటారు.
మరి గ్రాఫిక్స్ లో కట్టే శాశ్వత కట్టడాలు
ఎప్పుడు కడతారో తెలియదు..
ఇంజనీర్లు కంట్రాక్టర్స్ టెక్నాలజీ అన్నీ మనదేశంలో
దొరుకుతుంటే ఆ ఊ అంటే జపాన్ చైనా సింగపూర్ అంటారు.
వాళ్ళు ఎప్పుడు డిజైన్స్ ఇస్తారు ఎప్పుడు మొదలు పెడతారు..?
ఎప్పుడు రాజధాని మొహం చూస్తారు..?
ఎన్నాళ్ళు ఇలా గ్రాఫిక్స్ లో ముంచుతారు..?
.
గోదావరి పుష్కరాల్లో 27 మంది చనిపోతే
అది మీడియా అత్యుత్సాహం అని
రాయించి చేతులు దులుపుకుంటారా ??
ఇదేగా మీ విజనరీ ?? ఇందుకా మీరు మళ్ళి రావాలి ?
.
మొదట పోలవరం 2018 కల్లా పూర్తీ అవుతుంది అన్నారు.
ఆపై గ్రావిటితో నీళ్ళు ఇస్తాం అన్నారు.
అసలు అక్కడ ఇంకా 40 శాతం పనులు
ఇంకా మిగిలి ఉంటే ఎలా నీళ్ళు ఇస్తారో అర్ధం కాదు.
పైగా రాజధాని నిర్మాణం పోలవరం సందర్శన అంటూ
జనాలని ఊర్ల నుండి తెచ్చి ఒక్కొక్కరికి టిఫిన్ Rs.70/-
లెక్కన వేసి మూడునెలలలో 400 కోట్లు హారతి ఇచ్చేశారు.
మనది లోటు బడ్జెట్ అంటారు..
పైసా కేంద్రం ఇవ్వలేదు అంటారు..
ఇలా జనం సొమ్ములు ఊరికే ప్రచారాలకి తగలేసిన మీరు
ఎందుకు మళ్ళి రావాలి..? మా బాధ్యత మీరు తీసుకోరు.
మిమ్మల్ని ఇంటికి పంపే బాధ్యత మేము తీసుకుంటున్నాం.
.
అగ్రిగొల్డ్ ఆస్తుల వేలం
సమయానికి చేయకుండా దానిని
నాన్చి నాన్చి 130 మంది అమాయక
బాధితుల మరణానికి కారణం అయ్యారు.
.
గోదావరి కృష్ణ పుష్కరాలకి ఐదువేల
కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కేవలం
వెయ్యికోట్లు అగ్రిగోల్డ్ బాధితులకి పెట్టి
ఆపై వారి ఆస్తులని కోర్టు ద్వారా తీసుకొని ఉంటే
130 ప్రాణాలు గాల్లో కలిసేవి కాదు.
ఎందుకు మీరు మళ్ళి రావాలి చెప్పండి ?
.
కాల్ మనీ బాధితులు వందల్లో ఉన్నా
చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు
పార్టీలకి అతీతంగా శిక్షించి ప్రభుత్వ పెద్దగా
ఉండి నిజాయితీని చాటుకోవాల్సిన మీరు
అసలు దానివైపే దృష్టి పెట్టలేదంటే
మీరు మళ్ళి వచ్చి ఏమి మేలు చేస్తారో చెప్పండి.?
.
కేంద్రంతో నాలుగేళ్ళు కలసి ఉండి..
వారితో పని చేయించుకోవడం రాక..
మీకు అనుకూలంగా UC లు ఇచ్చినా ఇవ్వకున్నా
మీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇవ్వలేదని
కేంద్రం మీద ఒక రకమైన ద్వేషం పెంచుకొని
హోదాకి మంగళం పాడినప్పుడే వారు కూడా
మిమ్మల్ని ఎలా కావాలంటే అలా ఆడుకున్నారు.
నాడే ఒక అఖిలపక్షం వేసి ఉంటే మీ నాయకత్వం
మీద ఒక నమ్మకం విశ్వాసం ఉండి ఉండేది.
.
విశాఖలో భూ కుంభకోణం జరిగిందని
అందులో మీ మంత్రులు MLA లు స్వయంగా
ఒకరినొకరు రోడ్డుకేక్కితే ఆ కుంభకోణం
విలువ పదివేలకోట్లుపైగా అని తెలిసినా
SIT దర్యాప్తు పేరుకు వేసి ఆ రిపోర్ట్
నివేదిక ఇచ్చి సంవత్సరం అయినా దానిని
బయట పెట్టలేదంటే మీరు అవినీతిని
రూపుమాపే నాయకుడా..
మీలాంటి నాయకుడిని..?
మీ పార్టీని ఎందుకు నమ్మాలి ఒక్క కారణం చెప్పండి..?
.
ఇక పక్క రాష్ట్రంతో
ఎన్నో సమస్యలు ఉన్నా అవన్నీ
ఈ ఐదేళ్ళలో ఒక్కసారి కూడా గుర్తు రాలేదు.
తమరు ఒకరి ఇళ్ళకు ఒకరు వెళ్ళి..
కొసరి కొసరి భోజనాలు వడ్డించుకున్నప్పుడు..
కలసి హోమాలు చేసుకున్నప్పుడు గుర్తు రాలేదు.
హరికృష్ణ శవం పక్కన వారితో పొత్తు
పెట్టుకుందామని అడిగి వారు లేదు అన్నాక
వారి తప్పులు నేడు మాట్లాడుతున్నారా ??
.
మరి ఇన్నాళ్ళు విధ్యత్
ఉద్యోగుల సమస్యలు అడిగారా ?
లేక 29 BC కులాలని OC లో
కలిపినప్పుడు ఏమైనా మాట్లాడారా ?
దేనికి మిమ్మల్ని నమ్మాలి చెప్పండి ?
.
కాపులకి రిజర్వేషన్లు ఇస్తామని 2014 లో చెప్పి
అది జరగదని తెలిసి నోటి మాటతో చెప్పి
ఐదేళ్ళకి ఒక అసెంబ్లీ తీర్మానం చేసి తూతూ
మంత్రంగా ఒక చట్టం చేసేస్తే అది అయిపోతుందా ??
ఎందుకు హోంవర్క్ లేకుండా ప్రజలకి
హామీలు ఇచ్చి ఎర్రోల్లని చేయడం..
ఇందుకా మీరు మళ్ళి రావాలి..?
.
దివాకర్ ట్రావెల్స్ ద్వారా జరిగిన బస్సు ప్రమాదంలో
పదకొండు మంది మృతి చెందితే ఆ ట్రావెల్స్ పైన
ఈగ వాలకుండా ట్రావెల్స్ తప్పేమీ లేదని
ఎంతో ప్రేమ చుచూపుతూ కోర్టులో అఫడవిట్ దాఖలు చేశారు.
ప్రజల ప్రాణాలు అన్నా ఆస్తులు అన్నా లెక్కలేని
మీకు మీరు ఎందుకు మళ్ళి రావాలి..ఎలా అడుగుతున్నారు ?
.
ఐదేళ్ళుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు
కనీసం ఘనంగా రాష్ట్ర అవతరణ కూడా
చేయలేని దిక్కుమాలిన స్థితికి తీసుకెళ్ళారు.
.
మొదటి మూడేళ్ళు విభజన జరిగిన
తీరుకి రాష్ట్రం ఏర్పడ్డ రోజుని కాంగ్రెస్ పార్టీకి
వ్యతిరేకంగా నవ నిర్మాణ దీక్షలు చేసి చివరకు
అదే దరిద్రగొట్టు కాంగ్రెస్ తో కలసిపోవడం
మీ హీనమైన నీచమైన ద్వంద రాజకీయనీతికి నిదర్శనం.
మీరు మా బాధ్యత చూస్తారా ?? మీకు ఎందుకు ఓటేయాలి..?
.
దేశ వ్యతిరేక విధానాలు అవలంబించే
ఒక మమత బెనర్జీ, ఒక ఫరూక్ అబ్దుల్లా..
రాష్ట్రానికి అన్యాయం చేసిన దేవగౌడ
కన్నయ్య కుమార్ లాంటి వారిని
వెనకేసుకొచ్చిన క్రేజీవాల్ వీరా మీకు మిత్రులు..?
ఇలాంటి వారిని నమ్మి వారితో నడవడం వల్ల
దేశ రాష్ట్ర ప్రయోజనాలు ఎలా
కాపాడతారని ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు.?
.
ఇక 40 ఇండస్ట్రీ రాజకీయ నాయకుడిగా
23 మంది వేరే పార్టీల MLA లకి కండువాలు
కప్పి వారికి మంత్రులుగా ప్రమాణం చేయించిన
మిమ్మల్ని ఎందుకు ఏ విధంగా నమ్మి ఓటేయాలి ?
.
ఇక సీమలో పుట్టిన ముఖ్యమంత్రిగా
సీమ కరువుకి నీటిని ఇవ్వలేకపోయారు.
పేరుకి సీమ అంటారు కానీ..అసలు ఆయనకు
సొంత గడ్డపై మమకారం ఉన్నట్టు కనిపించదు.
ఉంటె రాయలసీమకి ఇవ్వాల్సిన హైకోర్టు కానీ
రాజధాని కానీ ఎందుకు ఇవ్వలేరు..??
.
ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద గ్రంధం అవుతుంది.
మరి ఇన్ని పొరపాట్లు తప్పులు చేసిన మీరు
మళ్ళి మీకు అవకాశం ఇవ్వాలని..
ఇస్తే ప్రజల బాధ్యత తీసుకుంటానని
ఎలా ఏ ధైర్యంతో చెపుతున్నారు ?
ఒకసారి పళ్ళు రాలగొట్టుకుంటాం కానీ
పదే పదే పళ్ళు రాలగోట్టుకోముగా..??
.
ఇక YCP-జగన్ ఓటు వేయాలా ?
———————–
ఈయనకు CM పదవి తప్ప
ప్రజల సమస్యలు అంటే లెక్క ఉండదు.
పిల్లోడికి బాత్రూం ప్రాబ్లం అంటే నేను
CM అయ్యాక చూస్తాను అంటాడు.
అప్పటివరకు వాడు అలా ఉండాల్సిందే.
.
ప్రజల సమస్యలు అసెంబ్లీలో చర్చించి
ప్రభుత్వం మెడలు వంచి పనిచేయాల్సింది
పోయి ఈయన అసెంబ్లీకి వెళ్ళకుండా ఉంటే
ఇక ప్రజలకి న్యాయం ఏమి జరుగుతుంది.
.
2014 TDP ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో..
ఈ ప్రభుత్వం ఆరునెలల్లో కూలిపోతుందని
జగన్ అన్నాడంటే అయన అధికార దాహం
ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
.
కనపడ్డ ప్రతి ఒక్కరికి
ఏమి కావాలంటే అది ఎంత కావాలంటే
అంత కనీసం రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో అని కూడా
తెలియకుండా ఇచ్చేస్తామని జగన్ చెప్పేస్తున్నారు.
కారణం ఆయనకు CM కుర్చీ ఎక్కేది కావాలి..అంతే.
.
అయనకి పగలు
జనం మధ్యలో ఉన్నా
జనం సమస్యలు గుర్తు రావు కానీ..
CM కుర్చీ గుర్తు వస్తుంది..
రాత్రి కలలో ఉన్నా CM..కుర్చీ గుర్తు వస్తుంది.
ఇది మన అయన గురించి క్లుప్తంగా చెప్పాలంటే.
.
ఇలాంటి రెండు పార్టీల నాయకులు
ఇప్పుడు 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి
అభ్యర్ధులుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి ఉన్నారు.
.
ప్రజలు ఇప్పుడు
పోయిలో నుండి పెనం మీదకు పడాలా లేక
పెనంలో నుండి పోయిలోకి పడాలా అనేది ఆలోచించుకోండి.
ఒకవేళ మీకు ఇలాంటివారు వద్దు అనుకుంటే
వేరే ఎవరైనా ప్రత్యామ్నయ పార్టీ ఉందా అనేది చూసుకోండి.
ఓటు వేసేముందు మీరు నిలబడే లైనులో అయినా
ఒక్క పది నిముషాలు ఎవరు మంచివారు
ఎవరు న్యాయం చేయగలరు అని అలోచించి ఓటు వేయండి.
.
ఓపిగ్గా చదివినందుకు అందరికి ధన్యవాదాలు.