హైదరాబాద్‌ కారులో 8 కోట్లు…

హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది ఎన్నికల సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో 8 కోట్ల నగదును నారాయణగూడ వంతెనపై పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తొలుత హిమాయత్ సర్కిల్ వద్ద కార్లు ఆపి తనిఖీ చేస్తున్న పోలీసులకు ఇద్దరు వ్యక్తుల వద్ద రెండు కోట్లు లభించింది. వీళ్లని ప్రశ్నించగా మరో ఆరు కోట్ల రూపా యలు నారాయణగూడ లోని ఓ బ్యాంక్ వద్ద వున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఆ నగదునూ స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం ఓ జాతీయ పార్టీకి చెందినదిగా భావి స్తున్నారు పోలీసులు.దీనికి సంబంధించి వివరాలు బయటకు రానప్పటికీ బీజేపీ పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన చెక్‌ని బ్యాంక్‌లో డ్రా చేశారు. అందులో రెండు కోట్లను ఓ వ్యక్తికి ఇచ్చినట్టు వార్తలు హంగామా చేస్తున్నాయి. ఆ వ్యక్తి నగదు తన కారులో తీసుకెళ్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో తీగలాగితే డొంక అంతా కదులుతోంది. దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో ఈ రేంజ్‌లో నగదు పట్టుబడడం ఇదే తొలిసారి.

About The Author