11/04/2019 రోజున జరుగబోయే ఎన్నికలు…జాగ్రత్తగా చుసి వోట్ వేయండి…
రేపు 11/04/2019 రోజున జరుగబోయే ఎన్నికలు ఢిల్లీ పార్లమెంటులో కూర్చుని దేశం మెుత్తాన్ని పరిపాలించే ప్రధానమంత్రిని ఎన్నుకునే లోక్ సభ MPఎన్నికలు. అంతేకానీ హైద్రాబాద్ లో కూర్చుని కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే అసెంబ్లీ ఎన్నికలు కావు,అసెంబ్లీఎన్నికలు గత మూడునెలల కిందనే జరిగాయు అందులో TRSపార్టీ గెలిచి KCR ముఖ్యమంత్రిగా పరిపాలింస్తున్నాడు.
ఇక ఇప్పుడు రేపు జరగబోతున్న ఎన్నికలు కేవలం మన తెలంగాణకే కాదు మెుత్తం దేశానికి ప్రధానమంత్రిని నిర్ణయుంచే ఎన్నికలు.ప్రధానమంత్రిగా ఇప్పుడు వున్న గౌ!! శ్రీ నరేంద్ర మెాదీ గారు BJP పార్టీ తరుపున దేశం మెుత్తంలో వున్న 543 MP సీట్లకు తన BJP అభ్యర్థులతో పోటీ చేస్తుంటే ,మన తెలంగాణలో వున్న TRS పార్టీ కేవలం 16సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది
ప్రధానమంత్రి కావాలంటే దేశంమెుత్తంలో ఉన్న 543 సీట్లలో 273 సీట్లను గెలిచిన పార్టీ ఢిల్లీ అధికారంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దేశాన్ని పరిపాలింస్తుంది. ఇక మీరే ఆలోచించండి 273 సీట్లు కావాలంటే TRS పోటీ చేస్తున్న 16 సీట్లకు ఇంకా ఎన్ని సీట్లు అవసరమో ఆలోచించండి, ఇలా దేశంలో వున్న అన్ని రాష్ట్రాల లోకల్ పార్టీలు పోటీచేస్తున్న సీట్ల సంఖ్యను కొన్నింటిని తెలియజేస్తాను చూడండి.
తెలంగాణలోKCR, TRS పార్టీ పోటీచేస్తున్న సంఖ్య 16.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి పోటీచేస్తున్న సీట్ల సంఖ్య 25.
పంజాబ్ ముఖ్య మంత్రి పోటీచేస్తున్న సీట్ల సంఖ్య 13.
ఓరిస్సా ముఖ్య మంత్రి పోటీచేస్తున్న సీట్ల సంఖ్య 21.
జార్ఖండ్ ముఖ్య మంత్రి పోటీచేస్తున్న సీట్ల సంఖ్య 14
పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి పోటీచేస్తున్న సీట్ల సంఖ్య 42.
రేపు మీరు వేసే ఓటు తెలంగాణ లో ముఖ్య మంత్రిగా వున్న KCRపార్టీ అయిన TRS కారు గుర్తుకు ఓటేస్తే, ఇలా దేశంలో వున్న అన్ని రాష్ట్రాల లోకల్ పార్టీ ముఖ్య మంత్రులు పోటీచేస్తున్న తక్కువ సీట్లను ఓక్కటిగా 273 సీట్లుగా చేసి ఇందులో ఎవరో ఓకరు ప్రధానిగా అవుతారు, పోత్తుల సంసారం లాగా వుంటుంది,నాకు ఈ పదవి కావాలని ఓకరు, నాకొడుకు ఫలానా పదవి కావాలని మరొకరు, మా కూతురుకు ఫలానా పదవి కావాలని మరొకరు, నా అల్లుడికి ఫలానా పదవి కావాలని మరొకరు ఇలా వారిలోవారే తన్నుకు చావడమే జరుగుతుంది కానీ మనగురించి మనదేశం గురించి పట్టించుకునే వారుండరు గమనించగలరు
ఇంతేకాదు తమ వారికోసం అడిగిన పదవులలో ఏమైనా తేడాలు వస్తే వారిలోవారికే గోడవలు వచ్చి ప్రభుత్వం విచ్చిన్నం అవుతుంది కుక్కలు చింపిన విస్తారిలాగా దేశం పరిస్థితి అవుతుంది, మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సివస్తుంది దాని ఖర్చు భారం మనమీదనే పడుతుంది. కాబట్టి దేశం మెుత్తంలో వున్న 543 సీట్లకు పోటీచేస్తున్న పార్టీ BJP పార్టీ గుర్తు “తామర పువ్వు “గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి సహకరించాలని కోరుతున్నాను. నరేంద్ర మోదీ చేసిన మంచిపనులను గుర్తించి BJP కి ఓటువేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను.
ఈ మెసేజ్ ను మీకు అందుబాటులో వున్న మీ మిత్రులకు షేర్ చెయ్యగలరని ప్రార్దింస్తున్నాను.