ఏప్రిల్‌ 10 నుండి తిరుపతిలో టైంస్లాట్‌ దర్శన టోకెన్ల జారీ సమయం మార్పులు…


తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుపతిలో జారీ చేస్తున్న సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల సమయంలో టిటిడి స్వల్పమార్పు చేపట్టింది. ఇదివరకు ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటల నుండి టోకెన్లు జారీ చేసేవారు. భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్‌ 10వ తేదీ బుధవారం నుండి ప్రతిరోజూ ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తారు.

తిరుపతిలో ఆర్‌టిసి బస్టాండు, శ్రీనివాసం, విష్ణునివాసం, ఛౌల్ట్రీలు, భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టైంస్లాట్‌ కౌంటర్లు ఉన్నాయి.

About The Author