ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు..

ఈ హిందూగాళ్లు… బొందు గాళ్లు…. దిక్కుమాలిన… దరిద్రపుగాళ్లు… దేశంలో అగ్గి పెట్టాలి… గత్తర లేవాలె…’’ అని కేసీఆర్ ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడారని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ అధ్యక్షుడు ఎం. రమణరాజు ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావుకు ప్రధాన ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. తన వ్యాఖ్యలపై ఏప్రిల్ 12లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

మార్చి 17న కరీంనగర్‌లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, ‘‘ఈ హిందూగాళ్లు… బొందు గాళ్లు…. దిక్కుమాలిన… దరిద్రపుగాళ్లు… దేశంలో అగ్గి పెట్టాలి… గత్తర లేవాలి…’’ అనిఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడారని, అతనిపై చర్య తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ అధ్యక్షుడు ఎం. రమణరాజు ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై విచారణ జరిపిన కమిషన్ కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది. ఆయన వ్యాఖ్యలు కులాలు, మతాల మధ్య విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, సామరస్యానికి భంగంకలిగించేలా ఉన్నాయని తెలిపింది.

దీనిపై ఏప్రిల్ 12 సాయంత్రం ఐదు గంటలలోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్‌ను ఆదేశించింది. లేదంటే ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.

About The Author