పులులను సంహరించి దాని చర్మాన్ని, గోళ్లను అక్రమంగా స్మగుల్ …
పులులను సంహరించి దాని చర్మాన్ని, గోళ్లను అక్రమంగా స్మగుల్ చేస్తున్న నలుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన మల్కాజిగిరి ఎస్.ఓ.టి పోలీసులు
భారతదేశంలో అంతరించిపోతున్న పులుల దృష్టిలో పెట్టుకుని వాటిని కాపాడాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఎంత కృషి చేసినా కొంతమంది స్మగ్లర్లు డబ్బులకోసం పులులను సంహరించి వాటి చర్మాన్ని ,గోళ్లను సుమారు 5 లక్షల రూపాయలకు వాటిని అమ్ముతున్నారని తెలిపారు.ఎల్బీ నగర్ పోలీసులకు అందిన సమాచారంతో మల్కాజిగిరి ఎస్.ఓ.టి పోలీసుల సహాయంతో ఈ నలుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసి వారి వద్దనుండి పులి చర్మాన్ని, నాలుగు గోళ్లను స్వాదీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా , ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఈ నలుగురు ఒడిశా రాష్ట్రంలోని అడవుల్లో తిరుగుతున్న పులిని చంపి దాని చర్మాన్ని హైదరాబాద్ లో అమ్మడానికి తీసుకొచ్చిన్నట్లు సమాచారంతో ఎస్వోటి పోలీసులు చర్మాన్ని కొనేవారి లాగా స్మగ్లర్లతో బేరం చేసి వారి వద్ద ఉన్న చర్మాన్ని , గోళ్లను స్వాదీనం చేసుకున్నారు. ఈ అపరేషన్లో పాల్గొన్న పోలీసులకు క్యాష్ ప్రైజ్ అందజేస్తామని రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ తెలియజేసారు.