7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన సాదుసంతు…

*1 వ ప్రశ్న:* ప్రపంచం లో ఏది పదునైనది?
*జ:* చాలా మంది కత్తి అని చెప్పారు
*సాదు:* కాదు ,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును,వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.

*2వ ప్రశ్న:* మనకు అత్యంత దూరం లో వున్నది ఏమిటి ?
*జ:* చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ
*సాదు:* మనకు అత్యంత దూరం లో వున్నది గడిచిపోయిన కాలం ,ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,ఆ కాలం లో కి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి.ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలం లోకి వెళ్లలేము.

*3వ ప్రశ్న:* ప్రపంచం లో పెద్దది ఏది?
*జ:* చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి
*సాదు:* ప్రపంచం లో పెద్దది మన పాపమే

*4వ ప్రశ్న ప్రపంచం లో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?
*జ:* చాలా మంది స్టీల్,ఐరన్,ఏనుగు అని చెప్పారు.
*సాదు:* కఠినమైనది అనేది “మాట ఇవ్వడం”
మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.

*5వ ప్రశ్న:* ప్రపంచం లో తేలికైనది ఏది?
*జ:* దూది,గాలి,ఆకులు అని చెప్పారు
*సాదు:* ప్రపంచం లో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.

*6వ ప్రశ్న:* మనకు దెగ్గరగా వున్నది ఏది?
*జ:* తల్లి తండ్రులు ,స్నేహితులు ,బంధువులు అని చెప్పారు
*సాదు:* మనకు దెగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది కచ్చితం.

*7వ ప్రశ్న:* ప్రపంచం లో సులువైనది ఏది ?
*జ:* తినడం ,పడుకోవడం,తాగడం,తిరగడం
*సాదు:* ప్రపంచం లో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం,ఇంతకంటే సులువు ఏదీ లేదు.

About The Author