నేడు ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం…


గురువారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య శుభ ముహూర్తాన సీతమ్మను రాములోరు పరిణయమాడనున్నారు. కళ్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.

హైలైట్స్

నేడు ఒంటిమిట్ట రాములోరి కళ్యాణోత్సవం,
రామయ్య కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి,
లక్షమంది భక్తులు వస్తారని అంచనా.

కోదండరాముడి కళ్యాణానికి కడప జిల్లా ఒంటిమిట్ట ముస్తాబయ్యింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య శుభ ముహూర్తాన సీతమ్మను రాములోరు పరిణయమాడనున్నారు. పున్నమి చంద్రుని వెలుగుల్లో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కళ్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. సీతారాముల కళ్యాణ వేదికను.. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. బెంగళూరుకు చెందిన నిపుణులతో ప్రత్యేకంగా అలంకరించారు. ముత్యంతో కూడిన 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు అందజేసేందుకు సిద్ధం చేశారు. కళ్యాణోత్సవానికి టీటీడీ, కడప జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేశారు. గవర్నర్, ముఖ్యమంత్రి రాకతో.. సుమారు 1500 మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు. 1200 మంది శ్రీవారి సేవకులు, 500 మంది స్కౌట్స్‌ భక్తులకు సేవలందించనున్నారు. గతేడాది జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్లు పాటించారు. ముఖ్యంగా షెడ్ల నిర్మాణం విషయంలో.. జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. లక్ష మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

About The Author