ఆస్పత్రిలో వింత సంఘటన.. రెండు తలల ఉన్న శిశువు మృతి…


హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని డాంగోరియా ప్రైవేట్ ఆస్పత్రిలో వింత సంఘటన చోటు చేసుకుంది. గర్భవతిగా ఉన్న ఓ గృహిణి ఐదు నెలలు కావడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వచ్చి స్కానింగ్ చేసుకోగా రెండు తలల శిశువు గర్భంలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్యులు కుటుంబ సభ్యులకు విషయం తెలియ చేసి వెంటనే ఆమెకు డెలివరీ చేశారు. దీంతో రెండు తలలు ఉన్న మృతి చెందిన మగ శిశువు జన్మించాడు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ముషీరాబాద్ బాపూజీ నగర్‌లో నివాసం ఉండే సుజాత, మహేష్ భార్య భర్తలు వీరి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం సురారం గ్రామం. వృత్తిరీత్యా డ్రైవర్ పనిచేస్తున్న మహేష్.. సుజాత బతుకుదెరువు కోసం ముషీరాబాద్ బాపూజీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే మొదటిసారి గర్భం దాల్చిన సుజాత వైద్య పరీక్షల కోసం ఐదు నెలల కావడంతో స్కానింగ్ తీయగా ఈ విషయం బయటపడింది. పుట్టిన మగ శిశువు రెండు తలలతో జన్మించి మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

About The Author