సీఎంవో, సీనియర్ ఐఏఎస్ సతీష్ చంద్ర నిర్ణయం వెనుక అసలు కారణం…?
సీఎంవో, సీనియర్ ఐఏఎస్ సతీష్ చంద్ర నిర్ణయం వెనుక అసలు కారణం…?
2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్నికలు జరిగినా… విభజిత ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడ్డాక, కేంద్ర సర్వీసులో ఉన్న 1986 బ్యాచ్ సీనియర్ ఐఏస్ అధికారి సతీష్ చంద్ర తిరిగి రాష్ట్ర సర్వీసులోకి రావడం, సీఎంవో లో కీలక అధికారిగా వ్యవహరించడం అందరికీ తెలిసిందే…. గతం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసిన కాలంలో… సతీష్ చంద్ర బాబుకు అత్యంత విశ్వసనీయ అధికారిగా పేరుపొందారు…
2014 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సతీష్ చంద్ర, అక్కడే అదనపు ప్రధాన కార్యదర్శిగా పదోన్నతిని కూడా పొందారు…
అయితే ప్రస్తుతం సతీష్ చంద్ర తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్ళేందుకు దరఖాస్తు చేసుకోవడం, అక్కడ తనకున్న పరిచయాల ద్వారా పోస్టింగ్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే వార్తలు ప్రస్తుతం సచివాలయంలో హాట్ టాపిక్ గా మారాయి…
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి… అటువంటి ఈ సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో నిన్నటి వరకు కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఏస్ అకస్మాత్తుగా కేంద్ర సర్వీసుకు దరఖాస్తు చేసుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందనేదే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ప్రధాన చర్చ…!