వీరాభిమాని కోరిక తీర్చిన చిరంజీవి గారు…
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం , మందపల్లి గ్రామానికి చెందిన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి వీరాభిమాని శ్రీ నక్కా వెంకటేశ్వరరావు చిన్నప్పటి నుండి శ్రీ చిరంజీవి గారిని ప్రగాఢంగా ప్రేమిస్తూ వున్నాడు.
ప్రజారాజ్యం సమయంలో కూడా పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయగా ఆ గ్రామంలో ఇతన్ని 5 సంవత్సరాల కాలం రాజకీయం గా వెలివేయడం జరిగింది.
ఆ విషయం తెలిసిన శ్రీ చిరంజీవి గారు అప్పట్లో ఇంటికి పిలిపించికొని రోజంతా ఆశ్రయమిచ్చి సర్వ మర్యాదలు చేసి కుటుంబం అందరికీ బట్టలు పెట్టి పంపించడం జరిగింది.
గత సంవత్సరం ఇదే నెలలో శ్రీ వెంకటేశ్వర రావుకు బాబు పుట్టడం జరిగింది .
అతనికి మెగాస్టారే నామకరణం చేయాలి లేదంటే ఎన్ని రోజులైనా వేచి ఉంటానని అన్నాడు.
ఆ విషయాన్ని శ్రీ చిరంజీవి గారు తెలుసుకొని ఈ రోజు కుటంబ సభ్యులు అందరిని ఇంటికి పిలిపించుకొని ఆ చిన్నారికి *పవన్ శంకర్* అని నామకరణం చేసి ఆ కుటుంబంతో గంట సేపు ముచ్చటించారు.
ఇక శ్రీ నక్కా వెంకటేశ్వర రావు కుటుంభ సభ్యులుకు ఆనందానికి అవదలు లేవు .