మధ్యం మత్తులో ఆత్మహత్య స్నేహితుడితో వీడియోకాల్ చేస్తూ ఘాతకం
తిరుచానూరు: సోషల్ మీడియా ప్రభావమో.. లేక ఆట పట్టించాలనే ఆలోచనో గానీ సెల్ఫీ వీడియో సరదాకి ఓ యువకుడి నిండు ప్రాణం పోయింది. చిత్తూరు జిల్లా, తిరుచానూరు సమీపంలోని దామినీడులో శివకుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన స్నేహితుడికి వీడియో కాల్ ద్వారా ఆటపట్టించాలనుకున్నాడు. కానీ మద్యం మత్తులో నిజంగానే చనిపోయాడు. శివకుమార్ ఆత్మహత్య చేసుకుంటాడని అతని స్నేహితులు ఊహించలేకపోయారు. ఏదో హడావుడి చేస్తున్నాడులే అని అనుకున్నారు. అతని వీడియోకాల్ చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది. శివకుమార్ మృతి చెందాడు. తొలుత ఊరి వేసుకుంటున్నట్టు శివకుమార్ తన మెడకు చీరతో ముడివేశాడు. కాలు కింద పెట్టాడు. ఉరి వేసుకునేయత్నం చేసిన శివ కుమార్ కూడా ఆ ఉరి నుంచి తప్పించుకోవాలని యత్నించాడు. అప్పటికే చీర మెడకు బిగుసుకుపోయింది. క్షణాల్లోనే ప్రాణం పోయింది. ఈ ఘటన శివకుమార్ కుటుంబంలో విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు……