పండ్లరసాలు వాటి ఉపయోగాలు – 4
ద్రాక్షారసం –
ద్రాక్ష ఎక్కువుగా జనవరి నుంచి మార్చి నెలల మధ్యకాలంలో ఎక్కువుగా లభ్యం అవుతాయి. ద్రాక్షపళ్లు నలుపు , ఆకుపచ్చ , వంకాయ రంగులలో లభ్యం అగును. ఇవి వివిధ ఆకారాలలో , వివిధ పరిమాణాల్లో లభ్యం అగును. చిన్నవాటిలో గింజలు ఉండవు. పెద్దవాటిలో గింజలు ఉంటాయి.
చరకసంహితలో చరక మహర్షి ఈ ద్రాక్షపళ్ళు గురించి చాలా చక్కగా వివరించారు. ద్రాక్షాపళ్లు మంచి పథ్యముగా , తియ్యగా , శరీరము నందు శాంతము కలిగించే విధముగా ఉండును. గొంతు , చర్మం, జుట్టు, కళ్ళకు సంబంధించిన సమస్యలకు అద్భుతముగా పనిచేయును . ఆకలిని పెంచును. శరీరము నందు మంట, దాహము , జ్వరం , కుష్టు , క్షయ , క్రమం లేని రుతువులు , గొంతు సమస్య , వాంతులు , స్థూలకాయం , దీర్ఘకాల కామెర్లు అనగా హెపటైటిస్ వంటి వాటి మంచి ఔషధముగా పనిచేయును . ఉదరము నందు ఆమ్లతత్వాన్ని తగ్గించును .
అనేక పురాతన ఆయుర్వేద గ్రంథాలలో యవ్వనాన్ని నిలిపి ఉంచుటకు ముసలితనం తొందరగా రానివ్వకుండా ఉంచుటలో ద్రాక్ష అద్భుతముగా పనిచేయును అని రాసి ఉంది. ఇవి మంచి పోషకాలను కలిగి ఉంటాయి. గ్యాస్ సమస్య కూడా తగ్గిపోవును . ద్రాక్షపళ్లు యూరిక్ సమస్యలు , మూత్రకోశములో మండుతున్న అనుభూతి , మూత్రపిండాలలో రాళ్లు నుండి మంచి ఉపశమనాన్ని కలిగించును.
ఈ ద్రాక్షపళ్ళు రసాన్ని వైద్యులు ఎక్కువుగా కీళ్ల వాపులు , ఋతుసంబంధ సమస్యలు , రక్తస్రావానికి వాడుతుంటారు. పచ్చి ద్రాక్షపండ్లలో ఎక్కువ ఆమ్లమూలాలు తక్కువ పంచదార ఉంటాయి. కాని పండిన ద్రాక్షపండ్లలో పంచదార మొత్తం గమనించదగినంత పెరిగిపోవును. ద్రాక్షలో ఉండే పంచదారలో గ్లూకోజ్ ఎక్కువుగా ఉండును. ద్రాక్షపండ్లను మిగతాపండ్లను సమాన తూకంలో తీసుకుని చూస్తే ద్రాక్షపండ్లలోనే గ్లూకోజ్ అధికంగా ఉండును. ద్రాక్షపండ్లలో ఉండే గ్లూకోజ్ శరీరంలో తొందరగా కలిసిపోవును. రక్తహీనతతో బాధపడేవారు ద్రాక్షారసం తీసుకోవడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. ద్రాక్షలో ఉండే మాలిక్ , సిట్రిక్ , టార్టారిక్ ఆమ్లాలు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. ప్రేగుల , మూత్రపిండాలు చురుకుపరుస్తాయి.
ద్రాక్షపండ్లను సహజరూపంలో తీసుకోవచ్చు . కాని వైద్యపరంగా స్వచ్చమైన తాజా రసములో ఎక్కువ విలువలు ఉంటాయి. ద్రాక్షపండ్లు ప్రతినిత్యం తీసుకోవడం వలన మలబద్దకం సమస్య తీరును . మొలల సమస్య కూడా తగ్గుముఖం పట్టును . పిత్తరసం ఎక్కువ అయ్యి ఉదరంలో మండుతున్నట్టు ఉండే భావన శాంతపరచగలిగే శక్తి వీటికి ఉంది.సాధరణ బలహీనత , నిస్సత్తువ , నిలిచిపోయిన బరువు , చర్మం ఎండిపోవుట , దృష్టి డిమ్ముగా ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ రసాన్ని వాడవలెను.
ద్రాక్షారసాన్ని కొన్నిరోజులపాటు ఆగకుండా వాడటం వలన అనవసరమైన వేడి శరీరం నుంచి తీసివేయబడింది. శరీరం శుభ్రంగా , చల్లబడును. ద్రాక్షారసం తాగడం వలన రక్తవిరేచనాల లక్షణాలు అన్ని మాయం అవుతాయి. క్యాన్సర్ నయం చేస్తుంది. రక్తహీనత వలన బాధపడేవారు ప్రతినిత్యం 300 మి.లీ ద్రాక్షరసం తీసికొనవలెను.
గమనిక –
నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు