మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్…

https://youtu.be/bF_D49Cw_-8

సూర్యపేట జిల్లా కేంద్రంలో నీ మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుండి

ఇంటర్మీడియట్ ఫలితాలపై వస్తున్న అపోహలు,ఆందోళనలపై రాష్ట్ర విద్యాశాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

మంగళవారం ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలోనీ తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడారు.

కొంతమంది దీనిని రాజకీయం చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అటువంటి చిల్లర ప్రయత్నాలను పసిగట్టాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులకు మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధించారు.

అంతర్గత తగదాలతో వచ్చిందా ….లేదా నిజంగానే ఏమైనా జరిగిందా ….ఈ అపోహలు ఎప్పుడు సృష్టించబడ్డాయి….ఎప్పటినుండి ప్రారంభమైనాయి…..ఎందువల్ల ఈ అపోహలు సృష్టించబడ్డాయి అన్న అంశంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ఆయన స్పష్టం చేశారు…..
అదే సమయంలో నిజంగానే సాంకేతికంగా తప్పులు జరిగినా ….దానికి బాద్యులను గుర్తించి కఠినంగా శిక్షించేందుకే టి యస్ టి యస్ యం డి వెంకటేశ్వరరావు అద్వర్యంలో నిపుణుల కమిటీని వేసినాము ….నివేదిక రాగానే చర్యలు మొదలు పెడతామని ఆయన తేల్చి చెప్పారు ……ఈ మొత్తం వ్యవహారం లో ఏ ఒక్క విద్యార్థిని నష్టపోనివ్వమని ఆయన స్పష్టం చేశారు…..నిపుణుల కమిటీ కూడా వేగవంతంగా పనిచేస్తుందని ….బుధవారం సాయంత్రం లేదా గురువారం నాటికి నివేదిక ప్రభుత్వానికి చేరవచ్చని ….ఆ నివేదిక ఆధారంగా తప్పు తేలితే దోషులు ఎంతటి స్థానంలో ఉన్నా చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.
అదే సమయంలో సంయమనం పాటించాల్సిన రాజకీయ పార్టీలు బాద్యాతా రాహిత్యం గా ప్రవర్తిస్తున్నాయాన్నారు.
దయచేసి పిల్లలు, తల్లి తండ్రులు ఆందోళన కు గురికావొద్దని ఆయన అభ్యర్ధించారు.
తప్పులు జరిగిందా లేదా అన్నది నివృత్తి కాకుండానే విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలా విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.
ఇది సరైన పద్ధతి కాదని మంత్రి జగదీష్ రెడ్డి విపక్షాలకు ఉపదేశించారు.
మీరు చేసే రాజకీయాలతో ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉత్పన్నమైందన్నారు.
తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని …ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు ఆస్కారం లేదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
కమిటీ ఇచ్చే నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తుందని ఆయన చెప్పారు .
ప్రత్యేకించి నష్టపోయామని భావిస్తున్న విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం తరహాలోనే ఈ సంవత్సరం కూడా రీ-వాలిడేషన్ ,రీ-కౌంటింగ్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు .

*మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్*

ఇంటర్మీడియట్ ఫలితాలను విపక్షాలు రాజకీయం చేయచూస్తున్నారు

విపక్షాల యత్నాలు విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా ఉంది

బాధ్యత రాహిత్యం గా ప్రవర్తిస్తున్న విపక్షాల చిల్లర ప్రయత్నాలను విద్యార్థులు, తల్లి,తండ్రులు గమనిస్తున్నారు

ఫలితాలపై వస్తున్న అపోహలను తొలగించడానికే ప్రభుత్వం కమిటీ వేసింది

ఇంటర్మీడియట్ బోర్డులో అంతర్గత తగదాలా లేదా సాంకేతిక లోపమా అన్నది కమిటీ తెలుస్తుంది

ఈ అపోహలు ఎక్కడ సృష్టించబడ్డాయి….ఎప్పటి నుండి మొదలు అయినాయి అన్న అంశంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది

త్వరలోనే బాధ్యులెవరో తెలుస్తాం

ఈ అపోహలు ఆందోళనలకు కారణమైన కారకులపై చర్యలు కఠినంగా ఉంటాయి

కమిటీ తుది నివేదిక రాగానే చర్యలు మొదలుపెడుతాం

సాంకేతికంగా తప్పులు జరిగాయా లేదా అన్నది కమిటీ తేలుస్తుంది

కమిటీ వేసి నివేదిక రాకముందే విపక్షాలు చిల్లర ప్రయత్నాలకు దిగుతున్నాయి

కమిటీ వేగవంతంగా పనిచేస్తుంది

బుధవారం సాయంత్రం లేదా గురువారం నాటికి కమిటీ నివేదిక సమర్పించవచ్చు

ప్రభుత్వం నివేదిక కోసం ఎదురుచూస్తోంది…

నివేదిక లో దోషులు తేలితే శిక్షలు కటినంగా ఉంటాయి

పిల్లలు తల్లి,తండ్రులు ఆందోళన కు గురికావొద్దు

About The Author