తెలంగాణ రాష్ట్ర డీ.జీ.పీ శ్రీ. యం. మహేందర్‌ రెడ్డి వరంగల్‌ పర్యటన..


ముందుగా డీ.జీ.పీ గారికి వరంగల్ పోలీస్‌ కమిషనరేట్ సాయుధ పోలీసులు డీ.జీ.పీ గారికి గౌరవ వందనాన్నిఇవ్వగా కమీషనర్ డా .వి.రవీందర్‌ గారు పుష్పాగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వరంగల్‌ ఆర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అసిస్టేంట్‌ కలెక్టర్‌ సంతోష్‌లు డీ.జీ.పీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
అనంతరం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని డి.సి.పిలు, ఎ.సి.పిలు మరియు పోలీస్‌ స్టేషన్లకు చెందిన ఈకాప్స్‌, స్టేషన్‌ మరియు ఐ.టీ కోర్‌ విభాగం సిబ్బందితో పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా పోలీస్‌ అధికారులను ఉద్యేశించి మట్లాడుతూ.. ఐటీ కోర్‌ విభాగం ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి వాటిని పోలీస్‌ అప్లికేషన్‌ ద్వారా నమోదుచేసి ప్రజలకు సేవలు అందించడంలో మేరుగైన మార్పులు తీసుకరావడం కోసం టెక్నాలజీని అధికంగా వినియోగించడంతో పాటు పోలీసులందరు పోలీస్‌కు సంబంధించిన అన్ని అప్లికేషన్లను వినియోగించేట్లు చూసుకునే భాధ్యత ఐటీ కోర్‌ విభాగందేనని, పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాల్సి వుంటుందని. ముఖ్యంగా నేరాలు, రోడ్డు ప్రమాదాలు మరియు నేరస్థులకు సంబందిచిన పూర్తి సమాచారాన్ని సేకరించి టి.ఎస్‌ కాప్‌ అప్లికేషన్‌ ద్వారా నమోదు చేయడంతో పాటు జియో ట్యాగింగ్‌ చేయాల్సిన భాధ్యత స్టేషన్‌ అధికారులతో పాటు ఎ.సి.పి, డి.సి.పిలపై వుందని. అందరు సమిష్టిగా పనిచేసి త్వరలో హైదరాబాద్‌ తరహలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ను కూడా రూపోందించే విధంగా కృషి చేయాలని
సూచించారు.
ఈ సమావేశంలో డి.సి.పిలు నాగరాజు, శ్రీనివాస్‌ రెడ్డి, నరసింహతో పాటు ఎ.సి.పిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐలు పాల్గోన్నారు.

About The Author