నా అనే వారు లేరు అయిన అందరికన్నా టాప్…

అల్లారుముద్దుగా చూసుకునే అమ్మ లేదు…
లాలించే నాన్న లేడు…

తెలిసీ తెలియని వయసులోనే కన్నవారు దూరమయ్యరు. దీంతో బస్టాండే నీడనిచ్చింది. మనసున్నమారాజులు ఇంత పెడితేనే కడుపు నిండేది.అలాంటి బాలుడు ఇప్పుడు ఇంటర్ ఫలితాల్లో బీసీ గురుకులాల పరిధిలో స్టేట్ ఫస్ట్​ ర్యాంకర్ గా నిలిచాడు. తోటివారికి ఆదర్శంగా మారాడు.

బస్సెక్కి హైదరాబాద్ లోదిగి..
మహబూబ్ నగర్ జిల్లా ఘనాపూర్ మండలం ఉప్పరపల్లికి చెందిన గీత, కృష్ణ దంపతుల కుమారుడు సంగిశెట్టి_కుమార్. రోజుకూలీలైన ఆ దంపతులు.. కుమార్ నాలుగోతరగతి చదువుతుండగానే అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆ బాలుడి చదువు ఆగిపోయింది. బతుకు ఆగమైపోయింది. ఓ రోజు బస్సెక్కి హైదరాబాద్ కు వచ్చాడు. బస్టాండ్ లో దిగాక ఎక్కడి వెళ్లాలో తెలియలేదు. చాలా రోజులు బస్టాపుల్లోనే తలదాచుకున్నాడు. ఇలా బస్టాపులో ఉండగా ఓ పెద్దమనిషి వచ్చి.. విజయనగర్ కాలనీలోని రెయిన్ బో చిల్డ్రన్స్ హోమ్ లో చేర్పించారు. అప్పటికి కుమార్ వయసు పదకొండేళ్లు. ఆహోమ్ లోని మిగతా అనాథల పిల్లలతో కలిసిపోయాడు. అక్కడి వారి సహకారంతో చదువును కొనసాగించాడు. ఆరో తరగతివరకు ఆ హోమ్ లోనే చదువుకున్నాడు. అనంతరం ఓ దాత సాయంతో హిమాయత్​నగర్ లోని ఆక్స్ ఫర్డ్​ స్కూలులో చేరాడు. పదోతరగతిలో 9.3 స్కోర్ సాధించాడు. ఇంటర్మీడ్మియట్ కోసం గురుకులాల ఎంట్రెన్స్ రాసి 2017లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకులంలో సీటు సంపాదించాడు. svp ఎంఈసీ గ్రూపులో జాయిన్ అయ్యాడు. మొదటి సంవత్సరంలో 488 సాధించి ఆ గురుకులంలోనే ఫస్ట్​ వచ్చాడు. ఇటీవల విడుదలైన సెకండియర్ ఫలితాల్లో మొత్తంగా 970 మార్కులుసాధించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకులాల్లో నే ఫస్ట్ ర్యాంకర్గా నిలిచాడు.

కుమార్ చిన్నచిన్న కవితలు కూడా రాస్తుంటాడు. తొమ్మిదో తరగతిలో ఆ బాలుడు రాసిన కవిత్వానికి జాతీయ బాలశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది.

ఐఏఎస్ అవుతా: కుమార్
‘‘దిక్కుతోచని స్థితిలో ఉండగా ఆదుకున్నరెయిన్ బో హోమ్స్– అమన్ వేదికకు రుణపడిఉంటా. అమ్మానాన్న చనిపోగానే ఒంటరినయ్యాను. ఇక బడికి వెళ్లొద్దనుకున్నాను.కానీ.. దాతల సహకారంతో మళ్లీ అక్షరాలుదిద్దుకున్నాను. సివిల్స్ సాధించి ఐఏఎస్ అవ్వడమే నా గోల్ . మరింత కష్టపడుతా. పేదవాళ్లకష్టాలు తెలుసు. నాలాంటి ఇబ్బందులు వేరేపిల్లలు ఎవరూ పడొద్దు. ఐఏఎస్ అయితే ప్రభుత్వ పథకాలతోపాటు సమాజ సేవ చేసే ఛాన్స్ఉంటది” అని అన్నాడు సంగిశెట్టి కుమార్.బీసీ గురుకులాల్లోనే ఫస్ట్​ ర్యాంకర్ గా నిలిచిన ఆస్టూడెం ట్ ను రెయిన్ బో హోమ్స్– అమన్వేదిక ప్రతినిధులు సన్మానించారు.

About The Author