బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ…


శ్రీలంకకు ఆగ్నేయంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ కేంద్రం అధికారులు తెలిపారు.

*ఆ తరువాత రానున్న 36 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

*దీంతో తదుపరి రెండు రోజుల్లో తుఫానుగా మారి దక్షిణ తమిళనాడు దిశగా ముందుకు సాగే అవకాశం ఉందని వివరించారు.

*దీని ప్రభావం వల్ల మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ముందస్తు సూచనలు చేశారు.

*ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

*ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి వర్షాలు కురిసే అకాశం ఉందని తెలిపారు.

*మరో వైపు ఉపరతల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు పడుతున్నాయి.

*తెలంగాణలో మూడు రోజుల పాటు పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

About The Author