హైదరాబాద్ లో పోయిన బస్సు నాదేండ్ లో దొరికింది… తుక్కుగా….

https://www.youtube.com/watch?v=NfPLfQEWNpU

హైదరాబాద్ లో పోయిన బస్సు నాదేండ్ లో దొరికింది… తుక్కుగా….

కుషాయిగూడ డిపోకు చెందిన ఏపీ11జెడ్‌ 6254 మెట్రోబస్సు రోజూ 3D సర్వీసుగా, అంబేద్కర్ నగర్(కుషాయిగూడ) – అఫ్జల్‌గంజ్‌ మధ్య నడుస్తోంది. మంగళవారం రాత్రి 11 గంటలకు అఖరి ట్రిప్‌ పూర్తయ్యాక బస్సు డ్రైవర్‌ వెంకటేశం, కండక్టర్‌ రాహుల్‌ బస్సును గతంలో పాక్షికంగా కూలిన పాత గౌలిగూడ బస్ షెల్టర్ నందలి బహిరంగ ప్రదేశంలో ఎప్పటిలానే పార్క్ చేసి, విశ్రాంతి గదికి వెళ్లి పడుకున్నారు. బుధవారం లేచి చూసేసరికి బస్సు కనిపించలేదు. బస్సు కోసం డిపోలో అంతటా వెతికినా ఫలితం లేకపోయేసరికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి, అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వందల కొద్దీ సీసీ కెమెరాల ఫుటేజీలను వడపోసి ఎట్టకేలకు బస్సు ఆచూకీని కనుగొన్నారు పోలీసులు..‌ అయితే అప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్ దగ్గర ఒక ఫౌండ్రీలో ఆ బస్సు భాగాలను వేరుచేసి, ముక్కలుగా స్క్రాప్ చేసారు దుండగులు.

అయితే బస్సు దొరికిన విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

సాధారణంగా ఆర్టీసీ బస్సులకు, ముఖ్యంగా హై ఎండ్ ఏసీ కాని సర్వీసులకు అనగా… సిటీ సర్వీసులు, పల్లె వెలుగు సర్వీసులకు సరైన తాళం ఉండదు. వాటిని డిపోల్లోనే నిలపాల్సి ఉంటుంది…. డ్రైవింగ్ లేదా మెకానిక్ విషయాలపై కాస్త అవగాహన ఉన్న వారు బస్సును స్టార్ట్ చేయవచ్చు. దానికితోడు సిటీ బస్సులకు తలుపులు ఉండవు…. ఇవన్నీ దుండగులకు కలిసివచ్చిన అంశాలు…

About The Author