మధురాపురం ఎంపిటిసి తెరాస అభ్యర్థిగా భార్గవ కుమార్ రెడ్డి నామినేషన్..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరుక్ నగర్ మండలం మధురా పురం గ్రామ ఎంపీటీసీ పదవి కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి ఆ గ్రామానికి చెందిన యువ నాయకుడు మల్కయ్యగారి భార్గవ్ కుమార్ రెడ్డి (మిన్ను) ఈ రోజు ఒక సెట్ నామినేషన్ ను లాంఛనంగా వేశారు. భార్గవ్ కుమార్ రెడ్డి వెంట ఫరూక్ నగర్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు పి. వెంకటరామ్ రెడ్డి ఉన్నారు. మొదటి నుండి ఎం పి టి సి టికెట్ భార్గవ్ కుమార్ ర్ రెడ్డిని వరిస్తుందననే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు మధురాపురం ఎంపీటీసీ టికెట్ ను భార్గవ్ దక్కించుకో పోతున్నారనే విషయం స్పష్టం అవుతోంది. చాలా రసవత్తరంగా సాగిపోతున్న మధురాపురం రాజకీయాల్లో భార్గవ్ కుమార్ రెడ్డి అధికార పార్టీ నుండి పోటీ చేయబోతున్నారు. రాజకీయంగా భార్గవ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మంచి పేరుంది. తెలంగాణ ఉద్యమ సమయం నుండి వారి కుటుంబ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారు. గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మల్కయ్య గారి నరసింహారెడ్డి కుమారుడే భార్గవ్ కుమార్ రెడ్డి ఈ నామినేషన్ దాఖలు చేయడం విశేషం. అదేవిధంగా వీరి కుటుంబంలో కీలక నేతగా ఏపీ రెడ్డి కూడా గతంలో సర్పంచ్ గా సేవలు అందించిన దాఖలాలు ఉన్నాయి. భార్గవ్ కుమార్ రెడ్డి ఎంపిక పట్ల గ్రామస్తులు, తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పెద్దఎత్తున మరో నామినేషన్ సెట్ వేసే అవకాశాలు ఉన్నాయి. నామినేషన్ దాఖలు చేసిన వారిలో మధురపూర్, శేరిగుడా,గంట్లవెళ్లి, తాండా గ్రామాలకు చెందిన నాయకులు ఫరూక్ నగర్ మండల టీఆర్ ఎస్ పార్టీ ప్రసిడెంట్ పి. వెంకట్రామిరెడ్డి, మధురాపూర్ మాజిసర్పంచ్ రంగయ్యగౌడ్, సీనియర్ నాయకులు బి. యాదయ్య గౌడ్, సేరి మధుసూదన్ రెడ్డి, సేరి మహేందర్ రెడ్డి, నక్కల శ్రీనివాస్ గౌడ్, నక్కల రాజు గౌడ్, ఆవ శివలింగం, ఏళ్ల రవీందర్ రెడ్డి, బొమ్ము చెంద్రశేకర్ గౌడ్, నంద్యాల బచ్చిరెడ్డి, ఎం శ్రీధర్ రెడ్డి, కేతావత్ గోపాల్ నాయక్, కంకాల లక్ష్మయ్య, నక్కల సుధాకర్ గౌడ్, కొమ్ము యాదయ్య, మరియు ఎం ఎల్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author