అన్నదాతలకు దూరమవుతున్న ఆత్మ బంధువులు…
పొలంలో రైతన్నలకు అసలైన నేస్తాలు ఈ మూగ జీవాలే. ఆవులు..గేదెలు..ఎద్దులు కళ్ల ముందు కనిపించకపోతే చాలా మంది రైతులు విలవిలాడిపోతారు. రోజంతా వాటితోనే కాలక్షేపం చేస్తారు. భాష రాకపోయినా ఎన్నో ఊసులు చెప్తారు. అవి చూపించే హావభావాలు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు. వాటికి కష్టం వస్తే తల్లడిల్లిపోతారు. ఏదైనా ఊరు వెళితే అవి గడ్డి తిన్నాయో లేదో.. నీళ్ళు తాగాయో లేదోనని అన్నదాతలు బెంగపెట్టుకుంటారు. ఎందుకంటే వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న బంధం అది. కేవలం 20 ఏళ్లలో ప్రపంచం మారిపోయింది. అందరికీ అన్నం పెట్టే అన్నదాత బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఒక వేళా గుండె నిబ్బరంతో బతుకుదామనుకుంటే మన విధానాలు బతకనివ్వడం లేదు. మూగజీవాలు ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవు . ఒకవేళ వాటికి కూడా భాష..భావం తెలిస్తే తమ ప్రియ నేస్తం రైతన్న పడుతున్న అగచాట్లు చూస్తే అవే ముందే ఆత్మహత్య చేసుకుంటాయి.
అన్నదాత సుఖీభవా..!!