శ్రీకాకుళంలో… మే 1 నుంచి తైక్వాండో వేసవి ఉచిత శిక్షణ శిబిరాలు…

ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తైక్వాండో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తైక్వాండో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని టౌన్‌ హాల్ వేదికగా వీటిని నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. మే 1వ తేదీన ప్రారంభం కానున్న వేసవి ఉచిత శిక్షణ శిబిరాల్లో భాగంగా ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటలకు నిర్వహిస్తామని తెలియజేసారు.అలాగే నరసన్నపేట మండలం, మబుగాం జెడ్పీ ఉన్నత పాఠశాలో, మైదానంలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, టెక్కలి డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం, సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌ ఆదేశాల మేరకు జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తామని, శిక్షణ అనంతరం క్రీడాకారులకు మెరిట్‌ సర్టిఫికేట్లు అందజేస్తామని సాయిరాం తెలిపారు. ఈ శిక్షణ అనంతరం మే 31 న గురువారం, జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. తైక్వాండో నేర్చుకోవడం వల్ల ఆత్మ రక్షణ క్రీడగానే కాకుండా శారీరక, మానసిక వికాశానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.క్రీడాకారులకు కావల్సిన మనో వికాసానికి, దేహ దారుఢ్యానికి తైక్వాండో క్రీడ బాసటగా నిలుస్తుందని వివరించారు. ఈ క్రీడ ద్వారా మానసిక ఆలోచనా శక్తి పెంపొందడంతో పాటు క్రమశిక్షణను అలవరుచుతుందని ఆయన తెలియజేసారు.

About The Author