గ్లోబరీనాకు కేటీఆర్ కు ఏ సంబంధం లేదు..?

ఇంటర్ ఇష్యూపై రాద్దాంతం చేస్తూ.. పరిషత్ ఎన్నికల్లో లబ్దిపొందాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశం. అందుకే లేని పోని రూమర్లు సృష్టించి.. టీఆర్ఎస్ పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ కు గ్లోబరీనా సంస్థకు ఎటువంటి సంబంధం లేకున్నా.. ఇద్దరికీ లింకులు అల్లుతూ రోజుకో కథ వినిపిస్తున్నారు. మొన్ననేమో.. కేటీఆర్ కు సన్నిహితుడు గ్లోబరీనా సంస్థ నిర్వాహకుడు అన్నారు. ఇప్పుడేమో.. కేటీఆర్ సూచనతోనే గ్లోబరీనాకు కాంట్రాక్ట్ దక్కిందని ఆరోపిస్తున్నారు. రేపు రేపు.. కేటీఆర్ సంస్థే.. గ్లోబరీనా అన్నా అంటారు. ఎందుకంటే.. నరంలేని నాలుక కదా ఏదైనా మాట్లాడుతుంది. కానీ.. మాట్లాడేముందు విచక్షణ, జ్ఞానం అనేవి కాంగ్రెస్ నాయకులు మర్చిపోతున్నారు.

ఇంటర్ విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయంగా బలపడాలని.. ప్రజల్లో మార్కులు కొట్టేయ్యాలన్న ఆత్రుత తప్ప కాంగ్రెస్ నాయకుల్లో విద్యార్థులకు న్యాయం జరగాలన్న ఉద్దేశం లేదు. ఇంటర్ ఇష్యూపై కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్న పొన్నం ప్రభాకర్.. ఒక్కసారి కేటీఆర్ ట్విట్టర్ ను పరిశీలించు. ఇంటర్ ఇష్యూపై, విద్యార్థుల ఆత్మహత్యలపై మొదట స్పందించిందే కేటీఆర్. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పడంతో పాటు.. విచారణకు కమిటీ వేస్తున్నామని.. అంతర్గతంగానూ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ లో క్లియర్ గా పెట్టారు. కమీషన్లు, కొట్లాటల మీద ఉన్న ఇంట్రస్ట్.. ఎవరేం మాట్లాడుతున్నారు అనేదానిపై కాంగ్రెస్ నాయకులకు ఉండదు కదా?. అది ప్రాబ్లమ్.

మిస్టర్ పొన్నం.. ఇంటర్ ఇష్యూ పేరుతో టీఆర్ఎస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని… కేటీఆర్ మీద బురదజల్లి బ్యాడ్ నేమ్ తేవాలని కాంగ్రెస్ నాయకులంతా కంకణాలు కట్టుకున్నా వచ్చేదేమీ ఉండదు. ఎందుకంటే.. టీఆర్ఎస్ ఎక్కడా తప్పు చేయలేదు. అందుకే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. త్రిసభ్య కమిటీ రిపోర్ట్ ప్రకారం.. బాధ్యులు ఎవరైనా సరే వారిపై కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా ఇంటర్ వివాదాన్ని ఇక ముగిస్తే మంచిది.

About The Author