తెలంగాణలో ఇంటింటికీ పైప్‌లైన్ వంటగ్యాస్…


తెలంగాణలో ఇంటింటికీ వంటగ్యాస్ అందించేందుకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణానికి మార్గం సుగమం అవుతోంది. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ఎల్పీజీ వంట గ్యాస్ సరఫరాను మెరుగుపరిచేందుకు కర్ణాటకలోని హసన్ నుంచి హైదరాబాద్ సమీపంలోని చర్లపల్లి బాట్లింగ్ యూనిట్ వరకు పైప్లైన్ నిర్మాణం చేపట్టాలని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(హెచ్పీసీఎల్) నిర్ణయించింది.

ఈ పైప్లైన్ కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోని జోగులాంబ-గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల మీదుగా చర్లపల్లి వరకు నిర్మించాలి. హసన్ నుంచి చర్లపల్లి వరకు నిర్మాణం చేపట్టాల్సిన 680 కిలోమీటర్ల పైప్లైన్ కోసం సుమారు రూ.2,200 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. రాష్ట్ర పరిధిలో 240 కిలోమీటర్ల మేర పైప్లైన్ మార్గం నిర్మించాలి. అందుకు రూ.771 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.

ఈ నిర్మాణానికి ప్రైవేటు వ్యక్తుల నుంచి భూసేకరణ చేపట్టాల్సి ఉంది. నిర్మాణంలో భాగంగా పంపింగ్ స్టేషన్స్, పలు ప్రాంతాల్లో పైప్లైన్ వాల్వులను ఏర్పాటు చేయనున్నారు. జూన్ తరవాత నిర్మాణ పనులు చేపట్టాలని హెచ్పీసీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. స్టేషన్ల నిర్మాణాల కోసం చేపట్టాల్సిన భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. భూ యజమానులతో సంప్రదింపులు నిర్వహించటం ద్వారా ఆ క్రతువును పూర్తి చేయాలని నిర్ణయించి హెచ్పీసీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఒక్కో జిల్లాలో అయిదుగురు సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాల జాయింటు కలెక్టర్లు ఛైర్మన్లుగా, ఆర్డీవోలు కన్వీనర్లుగా, ముగ్గురు హెచ్పీసీఎల్ అధికారులు సభ్యులుగా కమిటీలను నియమించారు. భూ యజమానులతో చర్చలు నిర్వహించి ఈ కమిటీలు ధరను నిర్ణయిస్తాయి. ఈ ప్రక్రియను వచ్చే వారం నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పైప్లైన్లలో భాగంగా ఎల్పీజీ స్టేషన్లు, వాల్వుల నిర్మాణ పనులను జూన్లో ప్రారంభించాలని హెచ్పీసీఎల్ నిర్ణయించింది. రాష్ట్ర పరిధిలో ఆరు ప్రాంతాల్లో స్టేషన్లు, 16 ప్రాంతాల్లో పైప్లైన్ల వాల్వ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్కో స్టేషన్ నిర్మాణానికి కనీసం 15 ఎకరాల భూమి, ఒక్కో వాల్వ్ నిర్మాణానికి కనీసం ఒక ఎకరం భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచి చర్లపల్లిలోని హెచ్పీసీఎల్ బాట్లింగ్ ప్లాంట్కు గ్యాస్ను తరలిస్తారు. నిర్మాణ పనులు చేపట్టిన నాటినుంచి ఏడాది లేదా ఏడాదిన్నర వ్యవధిలో పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

About The Author