దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా వెలుగు చూడని బుద్దుడి ప్రతిమ…
దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా వెలుగు చూడని బుద్దుడి దిగా భావిస్తున్న భారీ గార ప్రతిమ ( డంగు సున్నం తో రూపోందించిన ) సూర్యపేట జిల్లాలోని ప్రముఖ బౌద్ద స్తూప క్రేంద్రమైన ఫణిగిరి లో వెలుగుచూసింది. ఫణిగిరి బౌద్ద స్తూపం ప్రాంగణంలో గత రెండు మూడు నెలలుగా కేంద్ర పురావస్తూ శాఖ అనుమతి తో రాష్ట్ర పురావస్తూ శాఖ తవ్వకాలను ప్రారంబించింది. ఈ తవ్వకాల క్రమములో ఆరు అడుగుల అద్బుత భారీ ప్రతిమ బయల్పడింది. ఈ భారీ ప్రతిమను హైదరాబాద్ లోని పురావస్తూ శాఖ కార్యలయంలోని మ్యూజియం లో పురావస్తూ శాఖ ఇంచార్జీ డైరెక్టర్ సునితా భగవత్ అద్వర్యంలో భద్రపరిచారు. మ్యూజియంలో భద్రపరచి ఉన్న బుద్దుని ప్రతిమను రాష్ట్ర అబ్కారి, పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తూ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు.