నంద్యాల ఎంపీ.. నంది పైపుల సంస్థ అధినేత… S.P.Y రెడ్డి(68) కన్ను మూత….
నంద్యాల ఎంపీ.. నంది పైపుల సంస్థ అధినేత… S.P.Y రెడ్డి(68) కన్ను మూత….
కడప జిల్లా లోని అంకాలమ్మ గూడురులో 1950 జూన్ 4 న జన్మించిన ఎస్పీవై రెడ్డి, వరంగల్ NIT నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడైన తర్వాత, ముంబై లోని ప్రఖ్యాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో 1977 వరకు సైంటిఫిక్ ఆఫీసర్ గా పనిచేసి, 1979లో ప్లాస్టిక్ డబ్బాల తయారీ ని ప్రారంభించారు… 1984 లో నంది పైపులు అనే కంపనీని స్థాపించి, పీవీసీ పైపుల తయారీ రంగంలోకి అడుగు పెట్టారు ఎస్పీవై రెడ్డి.
1991 లో భారతీయ జనతా పార్టీ నంద్యాల పార్లమెంటు అభ్యర్థి గా రాజకీయ జీవితం ప్రారంభించిన రెడ్డి, మొదటి సారిగా ఎంపీ అయ్యింది మాత్రం 2004 లో కాంగ్రెస్ తరఫున నంద్యాల అభ్యర్థిగా… తరువాత 2009, 2014 లో నంద్యాల నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు…
2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచినా… ఫలితాలు వెలువడిన వెంటనే ఎంపీగా ప్రమాణ స్వికారం కూడా చేయకనే… తెలుగుదేశం పార్టీలో చేరారు.
2019 లో జనసేన పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి నంద్యాల పార్లమెంట్ స్థానానికి బీ ఫాం అందుకొన్నారు.
ఈ నెల 3వ తేదీనుంచి అనారోగ్యం తో కేర్ ఆస్పత్రిలో చేరిన ఎస్పీవై రెడ్డి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు…