దేవాలయ ఆస్తుల పరిరక్షణ యజ్ఞం…

ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్ల భారీ ఎత్తున సాగుతున్న సంతకాలు సేకరణ ఉద్యమం.

తిరుమల తిరుపతి దేవస్థానం మొదలు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో పాలకవర్గం నియామకాలు ముఖ్యమంత్రి లేదా ఎమ్మెల్యేలు చేసే ప్రక్రియని అంతం చేసి వివిధ అంచెలలో హిందు భక్తులే తమతమ దేవాలయాలకి పాలకవర్గాన్ని ఎన్నుకునే చట్టం తీసుకు రావాలని గవర్నరు గారికి లిఖిత పూర్వకంగా లేఖలు రాసే యజ్ఞం జరుగుతున్నది.

రాజకీయ నాయకులు తమతమ నాయకులకీ కార్యకర్తలకీ ఉపాధి కల్పించే దిశగా దేవాలయ పాలకవర్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా వారు పాలకులతో కుమ్మక్కై ఎంతో పురావస్తు విలువలు కలిగిన శతాబ్దాల పురాతన విగ్రహాలు, వజ్యవైఢర్యాలు, నగలు, సంపద, భూములు కొల్లగొట్టేశారు. అదీ కాకుండా హిందువేతరులనీ పాలకవర్గంలో చేర్చి ఆచారనియమాలను మంటకలిపే కార్యక్రమాలు చేస్తున్నారు.

పాలక వర్గాలని హిందూ భక్తులే ఎన్నుకుంటే స్వచ్చమైన వ్యక్తిత్వం, దైవభక్తి, పాపభీతి, దైవసంపద పట్ల బాధ్యత గల వ్యక్తులని మాత్రభే ఎన్నుకునే అవకాశం వుంది. దేవాలయాలలో అవినీతి తగ్గుముఖం పట్టి, రాజకీయ నాయకుల ప్రాముఖ్యత ప్రమేయం పూర్తిగా తొలగే అవకాశం వుంది. ఆలయ ఆచారనియమాలను పాటిస్తూ హిందూ సాంప్రదాయాలని పరిరక్షణించేందుకు యువత నడుము బిగించారు.

ఈ చట్టంలో మార్పుకోసం రెండు కోట్ల లేకలని గవర్నరు గారికి రాసే లక్ష్యం పెట్టుకుని పని చేస్తున్నారు. ఆ పిదప సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్ని లేఖలు చేరాయో తెలుసుకుని ఇంతటి ప్రజామోదం వున్న చట్టాన్ని అమలు చేయరని ప్రశ్నిస్తారు.

దయచేసి ఈ లేఖ ప్రతులని, ఇటువంటి బ్యానర్లని మీ సమీపంలో దేవాలయాల వద్ద ఏర్పాటు చేసి సంతకాల సేకరణలో పాల్గొనాలని విన్నపం.

సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్ని లేఖలు చేరాయో అడగవలసి ఉన్నందున లేఖలన్నీ భారత తపాలా శాఖ రిజిస్టర్ పార్సిల్ ద్వారా పంపి రశీదు భద్రపరచుకోవాలని మనవి.

వివాహా, గృహప్రవేశం వంటి శుభకార్యాలలో, వ్రతాలు ఆచరించే ప్రదేశాలలో, తిరుమల శ్రీశైలం కనకదుర్గ దేవాలయం వంటి వివిధ దేవాలయ ప్రాంగణాలలో, రైలు ప్రయాణాలలో ఈ లేఖలపై సంతకాల సేకరణ కార్యక్రమంలో చేపడితే సులువుగా వ్యాప్తి చెందే అవకాశం వుంది.

ఈ యజ్ఞం మీ ఇరుగు పొరుగు, బంధు మిత్రులందరికీ, మౌఖికంగానూ, వాట్సప్ గ్రూపులలో షేర్ చేయ మనవి.

లేఖ నమూనా ప్రింట్ కోసం bit.ly/2UwSgpl

పలు చోట్ల ఇరుగు పూరుగు మహిళామణులు సాయంత్రం పూట గోవిందనామ జపం చేసి 108 లేఖల సంతకాలు సేకరిస్తున్నారు.
#ఈ_కార్యక్రమాన్ని_బాధ్యతతో_ఆచరిస్తున్న_పలువురు_మహిళా_మహరాణులకి_కోటికోటి_వందనాలు.

ఈ పోస్టు చదివి లైక్ తో సరిపెట్టకుండా మనవంతుగా లేఖలు రాసే కార్యక్రమం చేపట్టినపుడే దేవాలయాల సంపద, ఆచార వ్యవహారాలు సురక్షితం.

మనలో ఐకమత్యం లేకపోతే కంచె ఐలయ్య వంటీ దౌర్భాగ్యులు అనునిత్యం అవహేళన చేస్తూ మకించపరుస్తూ వుంటారు.

ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపే దాతలు తమ సమీప దంవాలయంలో ఇటువంటి బ్యానర్లు మరియు ముద్రించిన లేఖల ప్రతులు దేవాలయాల వద్ద అందుబాటులో వుంచ మనవి

*దయచేసి ఈ యజ్ఞం వివరాలు అన్ని ఫేస్బుక్ & వాట్సప్ గ్రూపులలో షేర్ చేయ మనవి*

About The Author