కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల, ప్రణాళిక పై ఆరా…

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యారేజీలు, పంపుహౌజులు వద్ద ఇంజనీర్లు, సిబ్బంది బస చేయడానికి వీలుగా క్వార్టర్లు, వాచ్ టవర్ నిర్మించాలన్నారు. సబ్ స్టేషన్లు వద్ద విద్యుత్ అధికారుల నివాసానికి ఏర్పాట్లు చేయాలని, మేడిగడ్డ బ్యారేజి వద్ద విద్యుత్ అధికారుల నివాసానికి ఏర్పాట్లు చేయాలని, మేడిగడ్డ బ్యారేజి వద్ద పోలీస్ క్యాంపు ఏర్పాటు చేయాలని, బ్యారేజీల వద్ద రెండు చొప్పున హెలిప్యాడ్లు నిర్మించాలని సీఎం సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి, ఎంపి శ్రీమతి కల్వకుంట్ల కవిత, సీఎంవో కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ సలహాదారు శ్రీ పెంటారెడ్డి, ఇఎన్సీ హరేరామ్, ఓఎస్డీ శ్రీ శ్రీధర్ దేశ్ పాండే తదితరులు పాల్గొనారు.

బ్యారేజీల వద్ద నది ప్రవాహం ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ, ఎంత భారీ వర్షం కురిసినప్పటికీ ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగని రీతిలో హై ఫ్లడ్ లెవల్ కు చాలా ఎత్తులో వాచ్ టవర్, సిబ్బంది క్వార్టర్లు ఉండాలని సీఎం చెప్పారు. ప్రస్తుతమున్న హెచ్ఎఫ్ఎల్ కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వచ్చే హెచ్ఎఫ్ఎల్ ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల పరిధిలోని కాల్వల ద్వారా చెరువులను నింపడానికి చేసిన ఏర్పాట్లను సీఎం అడిగి తెలుసుకున్నారు. కాల్వలకు మూడు వేలకు పైగా తూములు ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా గొలుసుకట్టు చెరువులు నింపడానికి ప్రణాళిక రచించినట్లు అధికారులు తెలిపారు. గతంలో చెరువులు నింపుకోవడానికి రైతులు కాల్వలు తెంపే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వమే కాలువలకు తూములు ఏర్పాటు చేస్తున్నదని సీఎం చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా వచ్చిన నీటితో చెరువులు నిండడంతో పాటు, వర్షం ద్వారా కూడా నీరు వస్తుందని, దీంతో తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని సీఎం అన్నారు.

Hon’ble CM Sri K. Chandrashekar Rao instructed the officials concerned to prepare an integrated plan of action to complete the construction and maintenance of barrages and pump houses under Kaleshwaram Project. CM instructed the officials to construct housing quarters for the engineering staff and other staff at camp sites of the projects. CM directed the officials to construct housing quarters for the employees at the sub-stations, Police camp at the Medigadda barrage, two helipads at each barrage.

CM held a review meeting on the progress of construction of Kaleshwaram project on Tuesday at Pragathi Bhavan. Chief Secretary Sri SK. Joshi, MP Smt. Kalvakuntla Kavitha, CMO Secretary Smt. Smita Sabharwal, Advisor, Irrigation Department Sri Penta Reddy, ENC Sri Hareram, OSD Sri Sridhar Desh Pande and others participated.

CM asked the officials to construct watch Tower, staff housing quarters at the maximum height to the HFL level to shield from rampant river flow and high flood level. CM advised the officials to consider the HFL level after the completion of the projects. CM inquired about the progress of the construction of canals for filling of water in the ponds. Officers appraised the CM about the plan of installing 3000 conduits for every canal in order to fill the chain tanks. CM said that, earlier the farmers are being forced to fill their ponds by destroying the conduits. At present that is not the situation, the government itself is installing conduits. Water from projects and water form rains will be filled in the ponds and will increase the level of ground water.

About The Author