పెళ్ల‌యిన క్రికెట‌ర్ ప్రేమ‌లో కాజ‌ల్‌..?


మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటుతున్నా కాజ‌ల్‌కు అడ‌పాద‌డ‌పా ఛాన్సులు వ‌స్తూనే ఉన్నాయి. ఓ వైపు వ‌య‌స్సు పై బ‌డుతున్నా… కెరీర్ ముగింపు ద‌శ‌లో ఉన్నా కూడా ఆమె మాత్రం రేట్లు త‌గ్గ‌న‌నే చెపుతోంది. ఇక కాజ‌ల్ ముంబైకి చెందిన ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ఉంద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు పుకార్లు, షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇక తాజా విష‌యానికి వ‌స్తే ఆమె ఓ క్రికెట‌ర్ ప్రేమ‌లో ప‌డిపోయింది. ఆ ఆటగాడికి పెళ్లైంది. ఇటీవలే పాప పుట్టింది. పెళ్ల‌యిన క్రికెట‌ర్‌తో కాజ‌ల్ ప్రేమ‌లో ప‌డ‌డం ఏంట‌బ్బా ? అని బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టుకోవ‌ద్దు… ఆ క్రికెట‌ర్ అంటే ఆమెకు పిచ్చ అభిమానం అట‌.

ఇంతకీ ఆ ఆటగాడు ఎవరో తెలుసా? హిట్ మ్యాన్ రోహిత్ శర్మ్. వ్యక్తిగతంగా కాజల్ కి ముంబై బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టమట. రోహిత్ బ్యాట్ ప‌ట్టుకుని మైదానంలోకి దిగితే అత‌డి ఆట‌ను చూస్తూ ఉండిపోతాన‌ని… అత‌డు షాట్లు కొడుతుంటూ తాను చేసే అల్ల‌రికి అంతే ఉండ‌ద‌ని కూడా చెప్పింది. ఇక రోహిత్ రెచ్చిపోతే ఈజీగా డ‌బుల్ సెంచ‌రీ కొట్టేస్తాడంటోన్న కాజ‌ల్ ఆ వీర‌బాదుడినే ఇష్ట‌ప‌డుతుంద‌ట‌.

ఇక, సినిమాల విషయాకొస్తే ఈ వ‌య‌స్సులోనూ ఈ ముదురు ముద్దుగుమ్మ జూనియ‌ర్ హీరోల‌తో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేస్తోంది. రానా, శర్వానంద్, బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ల‌తో పాటు అటు చిరంజీవి లాంటి సీనియ‌ర్ల‌తోనూ జోడీ క‌డుతోంది. ప్రస్తుతం ‘సీత’ సినిమాలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్రంలో నటిస్తోంది. కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.

About The Author