పశ్చిమ గోదావరి జిల్లాలో యువతి కిడ్నాప్ కు ముస్లిం యువకుడి విఫల యత్నం – లవ్ జీహాద్ కోణం ?


పశ్చిమ గోదావరి జిల్లాలో యువతి కిడ్నాప్ కు ముస్లిం యువకుడి విఫల యత్నం – లవ్ జీహాద్ కోణం ?
ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని పాలకోడేరు మండలం విస్సాకోడేరులో కిడ్నాప్‌ కలకలం రేపింది. విస్సాకోడేరు గ్రామంలో ఓ యువతి తన తల్లితో కలిసి నెట్‌ సెంటర్‌కు వెళ్లింది. పని ముగించుకొని ఇంటికి తిరిగొస్తుండగా ఆయువతిని..షేక్ ఇనాయ‌తుల్లా అలియాస్‌ కాలేష్‌ అనే యువకుడు యువతిని బలవంతంగా కారులో ఎక్కించాడు. ఇది చూసిన యువ‌తి త‌ల్లి కారు డోర్‌ పట్టుకుని వేలాడుతూ అడ్డుపడ్డాది.. అదేమీ పట్టించుకోకుండా కారును వేగంగా ముందుకు పొనిచ్చాడు.
ఈలోపే షేక్ ఇనాయ‌తుల్లా యువ‌తినిను విస్సాకోడేరు నుంచి భీమవరం మండలం తాడేరు వరకు దాదాపు 10 కి.మీ తీసుకుని వెళ్లాడు.దీనిని గమనించిన స్థానికులు ఆ కారును వెంబడించి పట్టుకున్నారు. యువ‌తిని రక్షించిన స్థానికులు ఆ యువకుడిని చితకబాది.. పాలకోడేరు పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, షేక్ ఇనాయ‌తుల్లా గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ యువ‌తి వెంటపడి, వేధిస్తున్నాడని తెలిపారు పోలీసులు. కొన్ని నెలలుగా వెంటబడుతున్న పట్టించుకోక పోవడంతో ఆవేశానికి లోనైన షేక్ ఇనాయ‌తుల్లా ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు.తల్లి ఫిర్యాదు మేరకు పాలకోడేరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

About The Author