మసూద్ అజార్…అంతర్జాతీయ ఉగ్రవాది… ఐ.రా.స …


మసూద్ అజార్…అంతర్జాతీయ ఉగ్రవాది… ప్రకటించిన ఐ.రా.స భద్రతా మండలి…

జైషే మొహమ్మద్ ఛీఫ్.. మౌలానా మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి నిర్ణయం తీసుకుంది. ఇదే అంశాన్ని BBC నిర్ధారించింది…

గత కొంత కాలంగా… ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ వచ్చిన చైనా, అంతర్జాతీయ వత్తిడుల నేపథ్యంలో… తన వైఖరిని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

1994లో… హర్కతుల్ ముజాహిదీన్ కోసం శ్రీనగర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో భారత అధికారులు మసూద్ అజర్‌ను అరెస్ట్ చేశారు.

కానీ 1999లో ఐసీ-184 విమానాన్ని హైజాక్ చేశాక దానిని అప్ఘానిస్తాన్‌లోని కాందహార్ తీసుకెళ్లిన సమయంలో బందీలను విడిపించడానికి బదులుగా… మసూద్, మరో ఇద్దరిని జైలు నుంచి విడుదల చేసారు భారత అధికారులు…

1999లో తిరిగి పాకిస్తాన్ చేరుకోగానే మసూద్ అజర్ జైష్-ఎ-మొహమ్మద్ సంస్థను స్థాపించారు.

ఐక్యరాజ్యసమితి 2002లో ‘జైష్-ఎ-మొహమ్మద్’ను టెర్రరిస్ట్ సంస్థల జాబితాలో చేర్చడంతో పాకిస్తాన్ దానిని నిషేదించింది.

కానీ జైష్-ఎ-మొహమ్మద్‌పై నిషేధం విధించినా మసూద్ అజర్‌ను మాత్రం అరెస్ట్ చేయలేదు.

About The Author