సీబీఎస్ఈ ఫలితాల విడుదల… చెక్ చేసుకోండి ఇలా…
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 12వ తరగతి ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. 83.4 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వాస్తవానికి మే మూడోవారంలో 10, 12వ తరగతి ఫలితాలు విడుదలౌతాయని మొదట్లో వార్తలొచ్చాయి. కానీ సీబీఎస్ఈ విద్యార్థులకు సర్ప్రైజ్ ఇచ్చింది. 12వ తరగతి ఫలితాలను గురువారం విడుదల చేసింది. 10వ తరగతి ఫలితాలు రెండుమూడు రోజుల్లో విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం 31 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు.* *వారిలో 18.1 లక్షల మంది అబ్బాయిలు కాగా, 12.9 లక్షల మంది అమ్మాయిలు. ఫలితాలను విద్యార్థులు సులువుగా తెలుసుకునేందుకు సీబీఎస్ఈతో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. myCBSEapp యాప్లో కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.
ముందుగా సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ www.cbseresults.nic.in ఓపెన్ చేయండి.
12వ తరగతి ఫలితాల లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయండి.
మీ రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి.
ఫలితాలను ప్రింట్ అవుట్ తీసుకొని రిఫరెన్స్ కోసం పెట్టుకోవడం మంచిది.
గతేడాది 12వ తరగతి ఫలితాలు మే 26న, 10వ తరగతి ఫలితాలు మే 29న విడుదల చేసింది సీబీఎస్ఈ. గతేడాది 12వ తరగతి ఎకనమిక్స్ పేపర్ లీక్ కావడం వల్ల పరీక్ష మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఈసారి ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు నిర్వహించడం విశేషం