చర్మం ఎందుకలా జీవం కోల్పోయి నల్లబడిపోతుంది…


చర్మం ఎందుకలా జీవం కోల్పోయి నల్లబడిపోతుంది..?
ఎండలో చర్మం చురుక్కుమంటే..అర్థం ఏమిటి?
వడ దెబ్బ, మైగ్రైన్, మూలశంక, ఎసిడిటీ, ఆస్తమా.ఎందుకు పెరుగుతాయ్??

– డా. గౌతమ్ కశ్యప్

మన శరీరంలోని నీరు శరీర అవసరాలకు సరిపడినంతగా లేనప్పుడు, మన చర్మంలో చర్మం క్రింద వున్న కణజాలంలో నీటిని మెదడు, గుండె, లివర్ వంటి అది ముఖ్యమైన ఆర్గాన్స్ కి, వాటిల్లో వున్న కణజాలానికి అత్యవసరంగా అందించడానికి పీల్చుకుంటుంది. దానివల్ల ఆ ప్రదేశాలలో వున్న చర్మకణాలు నీరందక సూర్య రశ్మికి వేడెక్కిపోయి, కమిలిపోయి మాడిపోతూ వుంటాయి.
సరిగ్గా ఆ సమయంలోనే మన శరీరం సూర్యకిరణాల వేడి తట్టుకోలేక చుర్రు మంటూ మంటపుడుతుంది.
– నాలుక పిడచ కట్టుకు పోవడం ఆ తరువాతా మొదలౌతుంది.
– నీరు తగ్గిపోవడం వల్ల ఎసిడిటీ పెరుగుతుంది.
– రక్తం చిక్కబడడం వల్ల రక్తాన్ని కిడ్నీలు సరిగ్గా పరిశుభ్రం చేయలేవు.
– చాలినంత నీరు లేకపోవడం వల్ల, నీటి ద్వారా అందాల్సిన ఆక్సిజన్ అందకపోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ పరిమాణం తక్కువైపోయి ఆపస్మారక స్థితిలోకి వెళ్ళే ప్రమాదం వస్తుంది.
– విపరీతమైన తలనొప్పి, కడుపులో తిప్పడం ఒక్కోసారి వాంతులు రావడం జరుగుతుంది.
– తలతిరుగుతూ అయోమయంగా అయిపోతుంది
– మల బద్దకం ఎక్కువైపోతుంది.
– పైల్స్ మూలశంక సమస్య తీవ్రమౌతుంది.
– మైగ్రైన్ సమస్య పెరుగుతుంది.
– కార్బనైజ్ అవ్వడం వల్ల లివర్ లోని కణాలు పాడై జాండిస్ వ్యాధి ప్రమాదం ఎక్కువౌతుంది.
– చర్మంపై, మొటిమలూ, మచ్చలూ పెరిగిపోతాయి.
– కిడ్నీకి సమస్యలు పెరిగి, వ్యాధులు తీవ్రమౌతాయి.
– రక్తం బాగా చిక్కబడి పోయినప్పుడు రక్తప్రసరణ కష్టమై మెదడులోని కణాలకు ఆక్సిజన్ అందక ఆ కణాలు చనిపోయి పెరాలిస్ (పక్షవాతం) వచ్చే అవకాశం వుంది.
– గుండెలోని కణాలకు ఆక్సిజన్ అందకపోతే గుండెపోటు వచ్చే అవకాశమూ వుంది.
– నీరు శాతం మనశరీరం బరువులో మూడొంతులు వుండాలి. మన రక్తంలో ఎముకల్లో శరీరంలోని అన్ని గుండె, మెదడూ కాలేయం, మూత్రపిండాలూ, ఇలా అన్ని ఆర్గాన్స్ లోనూ నీరు సమృద్దిగా వుండడం అత్యవసరమైన విషయం అని మరువకూడదు.
.
ఎండలో మనం నడుస్తున్నప్పుడు అలా మన చర్మం చుర్రు మంటున్నది అంటే మన చర్మకణాలలో నీరు తగ్గిపోయిందని అర్థం. వెంటనే మనం నీడలోకి వెళ్ళాలి. ఒక అరలీటర్ నుంచి లీటర్ నీరు దాకా మామూలు సాధారణమైన మంచినీరుని మాత్రమే త్రాగాలి. సాధరణమైన మంచి నీరు అంటే ఏమిటో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన ఖర్మ పట్టింది. ఈ మల్టీనేషనల్ కంపెనీలు తమ ప్రచారంతో మనల్ని అయోమయానికి గురిచేస్తున్నందువల్ల.
సాధారణమైన మంచి నీరు అంటే బావి నీరు / కొట్టుడు పంపు నీరు/ పంచాయితీ నీరు, కార్పొరేషన్ వారు అందించే కుళాయి నీరు.
.
ఇక బాటిల్ వాటర్ కిన్లే, అక్వాఫినా, బిస్లరీ లాంటి మినరల్ వాటర్ పేరుతో దొరికే నీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ త్రాగరాదు. ఆ నీరు ఆల్కలైన్ మీడియంలో ఉండకుండా ప్రమాదకరమైన ఎసిడిక్ మీడియంలో వున్నది కనుక ఆ బాటిల్స్ వుండే నీటినీ, కూల్ డ్రింకులనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ తాగకుండా వుండాలి.
.
అవి తాగితే మనకు ఏమాత్రం మేలు జరగకపోగా ఇంకా సమస్య తీవ్రమై లివర్, కిడ్నీలు కూడా సర్వనాశనమైన పాడైపోయే ప్రమాదం వుంది. ఏనాడూ ఎన్నడూ లేనంత మంది ఈనాడు కేన్సర్లకు గురికావడానికి మొదటి కారణం కార్బన్ వాటర్ / మినరల్ వాటర్ రూపంలో మనం త్రాగుతున్న ఏసిడ్ వాటర్ పెస్టిసైడ్ వాటర్లే.
అందుకని సర్వసాధారణమైన బావినీరు, లేదా కొట్టుడు పంపు నీరు, లేదా, మంచినీటి చెరువునీరు, లేదా మునిసిపల్ పంచాయితీ/కార్పొరేషన్ నీరు నే త్రాగాలి.
ఎట్టిపరిస్థితుల్లోనూ ఐస్ వాటర్ కానీ, ఫ్రిజ్ వాటర్ కానీ,
ఐస్ ముక్కలు వేసుకుని మంచి నీరు కానీ త్రాగరాదు.
ఎందుకంటే…
అలా మనం నీరు త్రాగితే, ఆ నీరు వెంటనే శరీరానికి అందదు. శరీరంలోని కణజాలం, ఆ నీటిని పీల్చుకోవడానికి అనుమతించదు. అందవల్ల ఆ నీటిని శరీర ఉష్ణోగ్రత వరకూ సమానంగా వేడెక్కేవరకూ ఆ నీటిని జీర్ణాశయంలో వేడెక్కించిన తరువాతనే ఆ నీటిని శరీరకణజాలం పీల్చుకోగలుగుతుంది.
అంటే అప్పటి వారకూ మనం నీరు తాగినా శరీరానికి అందదు. ఇలాంటి సమయాల్లోనే వడదెబ్బ కొట్టే ప్రమాదం చాలా చాలా ఎక్కువైపోతుంది.
కనక బయటినుంచి ముఖ్యంగా ఎండలోంచి వచ్చిన మీ బంధువులకూ మిత్రులకూ ఐస్ వాటర్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి.
1. బిందెలోని నీటిని ఇవ్వండి. వీలైతే రాగిబిందెలో నీటిని ఇవ్వండి. బిందెలో నీరు దొరకని పక్షంలో
2. మట్టి కుండలోని నీటిని ఇవ్వండి.
పసి పిల్లలకు కూల్ వాటర్ కానీ, కూల్ డ్రింకులనూ కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ పట్టకండి.
అవి అత్యంత హానికరమైన భయంకరమైన పదార్థాలు అని గుర్తుంచుకోండి.
3. మీ పిల్లల జీర్ణాశయం గోడల్ని తినేసే తీవ్రాతి తీవ్రమైన ప్రమాదకరమైన కెమికల్స్ వాటిల్లో వున్నాయని మరువకండి.
మీ జీర్ణాశం గోడల్ని కూడా అవలీలగా అవి తినేస్థాయి.
4. ఏసిడ్ మీడియంలో కిన్లే, బిస్ లరీ కంపెనీల సోడాలు, వుండడం వల్ల కేన్సర్ కణాల్ని విపరీతంగా పెంచుతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కార్బన్ డ్రింక్స్ ని తీసుకోరాదు.
5. మనం మన శత్రువులకు కూడా చెయ్యకూడని పొరపాటు పనులు, చెయ్యాల్సిన పనులు మరోసారి గుర్తుచేసుకుందాం.
౧. ఐస్ / ఫ్రిజ్ వాటర్ ని బయటనుంచి మన ఇంటికి రాగానే ఇవ్వడం.
౨. కూల్ డ్రింక్ లను తాగడానికి ఇవ్వడం.
౩. పరమ నీచాతి నీచమైన పని పసి పిల్లలకు, వ్యాధి గ్రస్తులకు కూల్ డ్రింకులని ప్రేమతో తెచ్చివ్వడం.
౪. మీకు ప్రేమనిజంగా వుంటే చక్కని బత్తాయి పళ్ళను, సపోటా, మామిడి పళ్ళనూ తీసుకువెళ్ళండి.
౫. ఫ్రెష్ గా వున్న ముంజల్నీ, ఫ్రెష్ గా వుండే (ఫ్రిజ్లో పెట్టని) కొబ్బరినీళ్ళనూ ఇవ్వండి.
౬. ఎండలోంచి వచ్చిన వారికి టీ/కాఫీ/ డ్రింకు లను ఇవ్వకండి.
వారికి వెంటనే ఇవ్వాల్సింది నీరు. కుండలో వుంచిన నీరు. వీలైతే కొత్తకుండలో నీరు ఇవ్వండి.కుండలో వుంచిన నీరు మామూలు నీరు కన్నా అల్కలైన్ మీడియంలో వుండడాన్ని నేను టెస్ట్ చేసినప్పుడు గమనించాను.
ఆ నీరు ఎవరికైనా అమృతప్రాయమైనది.
భగవంతుడు ఉచితంగా మనకు అందించిన ఆ జలమే మనల్ని రక్షించే ప్రసాదమని, ఆ మామూలు నీరు అత్యంత ప్రాణావసరమైన ఈ సృష్టికర్త మనకు ఇచ్చిన జల ప్రసాదమని మరువకండి.
ఈ వేసవి కాలంలో అయినా మినరల్ వాటర్ తో ప్రచారమౌతున్న బాటిల్ వాటర్ నీ, ఈ కూల్ డ్రింకుల బారి నుంచి మనల్ని, మన పిల్లల్నీ మనం రక్షించుకుందాం.

About The Author