మహబూబ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ధర్నా చేస్తున్న బిజెపి నాయకులు అరెస్టు…

 

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జరిగిన అవకతవకల వలన 23 మంది అమాయక ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి కారణం అయిన గ్లోబరినా సంస్థ పైన, దీనికి సంబంధించిన వారిపైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు., ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. కె. లక్ష్మన్ గారు గత నాలుగు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు.
దీని కొరకు బీజేపీ రాష్ట్ర బంద్ చేయడం జరిగింది అని జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి పద్మజ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు..

About The Author