ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం… బాపట్ల MRO ను ట్రాప్ చేసిన అ.ని.శా…

నేటి మధ్యహ్నం 1.45 నిమిషాలకు, బాపట్ల తహసీల్దారు శ్రీ కొల్ల రాఘవయ్య లక్ష రుపాయల లంచం తీసుకొంటుండగా… అ.ని.శా అధికారులు పక్కా సమాచారంతో వల పన్ని రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకొన్నారు…

హైదరాబాద్ నివాసి అయిన ఆలపర్తి కోటేశ్వరరావు, తనకు రావలసిన పరిహారానికి సంబంధించిన ఫైలును గుంటూరు జాయింట్ కలెక్టర్-2 ఆఫీసుకు పంపడానికి, బాపట్ల MRO లక్ష రూపాయలు డిమాండ్ చేయగా… ఏసీబీ ని ఆశ్రయించారు.

పక్కా సమాచారంతో… వల పన్నిన అ.ని.శా అధికారులు, ఫినాప్తలీన్ పరీక్షలో సదరు MRO రెండు చేతులు పాజిటివ్ అని తేలడంతో… అదుపులోకి తీసుకొన్నారు. దాడి సమయంలో శ్రీ కొల్ల రాఘవయ్య వద్దగల అదనపు మొత్తం ముప్ఫై వేలను స్వాధీనం చేసుకొన్నారు…

About The Author