యాదాద్రి ఆలయ భద్రతపై సమీక్షా సమావేశం…

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేరొందిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో చేపట్టాల్సిన భద్రతలపై భువనగిరి జోన్‌ డీసీసీ నారాయణరెడ్డి ఆలయ నిర్వాహకులతో చర్చలు జరిపారు. ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న దృష్ట్యా బాలాలయం చెంత ప్రత్యేక నిఘా కొనసాగించేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. లగేజీ, చరవాణీలతో భక్తులు బాలాలయంలోకి ప్రవేశించరాదన్న ఆంక్షలను పాటించాల్సి ఉందని సూచించారు. ఆ క్రమంలో వాటిని భద్రపరిచే ఏర్పాట్లు దేవస్థానం చేపట్టాలని ఆలయ నిర్వాహకులన్నారు. ఆలయ పరిసరాలు, మండపాలతో సహా క్యూకాంప్లెక్స్‌లలో డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు సోదా, తనిఖీల పర్వం పటిష్ఠతపై అధికారులు చర్చించారు. సమావేశంలో ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తితోపాటు ఏఆర్‌ ఏసీపీ కృష్ణయ్య, గుట్ట ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐలు ఆంజనేయులు, నరసింహారావు, ఎస్‌పీఎఫ్‌ ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌రెడ్డి, ఏఈవోలు శివకుమార్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

About The Author