మహేశ్ బాబుకి అమ్మగా రమ్యకృష్ణ ..అత్తగా విజయశాంతి?


హైదరాబాద్:ఒకవైపు మహర్షి సినిమా విడుదలకు సమాయత్తం అవుతూ ఉండగా ప్రిన్స్ మహేశ్ బాబు తన తదుపరి సినిమాల విషయంలో కూడా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన నేపథ్యంలో మహేశ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ సరసన సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన్నా హీరో యిన్ గా నటిస్తోంది.ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయ శాంతిని  మరో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో విజయశాంతి ఏ పాత్రలో కనిపించనుంది రమ్యకృష్ణ పాత్ర ఏమిటి అనే ఆత్రుత అందరిలో ను మొదలైంది.ఈ సినిమాలో మహేశ్ బాబుకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుందనీ  అత్త పాత్రను విజయశాంతి పోషించనుందనేది తాజా సమాచారం. ఈ రెండు పాత్రలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయట. అందువల్లనే ఇంతటి క్రేజ్ వున్న సీని యర్ హీరోయిన్స్ ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. జగపతిబాబు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించ నున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

About The Author