వీఆర్కే డైట్- ఇండియా’ సూపర్… చైనీస్…


వీరమాచనేని రామకృష్ణ ప్రతిపాదిస్తున్న డైట్ కు ప్రముఖ చైనీస్ వైద్య అధ్యయన కేంద్రం గొప్ప గౌరవాన్ని ఇస్తోంది. ‘వీఆర్కే డైట్- ఇండియా’ను గుర్తిస్తూ.. సదరు వర్సిటీలో ఒక బ్లాక్ కు ఆ పేరును పెట్టింది. ఒక చైనీ వర్సిటీలో భారతీయ విధానానికి ఈస్థాయి గుర్తింపు దక్కడం విశేషం. అలాంటి ఘనతను వీరమాచినేని రామకృష్ణ ప్రతిపాదిత వీఆర్కే డైట్ సొంతం చేసుకుంది.

చైనాలోని ప్రఖ్యాత చాంక్జింగ్ హైజియా కాన్సర్ హాస్పిటల్, ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో.. వీరమాచనేని రామకృష్ణను ‘ఆంకో న్యూట్రీషియనిస్ట్’ అవార్డుతో ఘనంగా సత్కరించింది. అక్కడే ఇప్పుడు ‘వీఆర్కే – ఇండియా బ్లాక్’ కూడా ప్రారంభం అయ్యింది.

చాంక్జింగ్ వైద్య పరిశోధన కేంద్రంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిపాదనలో ఉన్న వివిధ డైట్స్ పై పరిశోధన సాగుతూ ఉంటుంది. అలా వీఆర్కే డైట్ పై కూడా పరిశోధన జరిగింది. భవిష్యత్తులో ఈ అంశం మీద మరింత పరిశోధన సాగడానికి ఒప్పందం కూడా కుదిరింది.

హాంకాంగ్, జపాన్ లలో కూడా వీరమాచినేని డైట్ కు వివిధ అధ్యయన సంస్థలు గుర్తింపును ఇస్తున్నాయి. వీఆర్కే –ఇండియా డైట్ పై మరింత లోతైన పరిశోధనలు సాగించి, అధ్యయనాలు నిర్వహిస్తూ ఉన్నాయి

About The Author