ప్రజాగాయకుడు అరుణోదయ రామారావు హఠాన్మరణం…

మూగబోయిన అరుణ కెరటం… ప్రజాగాయకుడు అరుణోదయ రామారావు హఠాన్మరణం…

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడుగా సంస్థపేరునే తన ఇంటిపేరుగా మార్చుకొని గడచిన నలభై సంవత్సరాలుగా తన పాటతో బడుగు బలహీన వర్గాలలో చైతన్యాన్ని నింపిన గొంతు నేడు శాస్వతంగా మూగబోయింది…

ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఆయన బంధువులు హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం మరోసారి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

కర్నులు జిల్లా ఆదోని తాలుకా మలుగుమల్లి గ్రామంలోని మధ్యతరగతి దళిత కుటుంబంలో పుట్టిన రామారావు అసలు పేరు మాల సత్యం.

తెలుగు రాష్ట్రాల్లోని వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలపాత్ర పోషించిన రామారావు భౌతికకాయాన్ని చూసేందుకు వామపక్షాల కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు అధిక సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ప్రజల సందర్శనార్థం రామారావు పార్థీవదేహాన్ని న్యూడెమోక్రసీ నేతలు విద్యానగర్‌లోని మార్క్స్ భవన్‌కు తరలించారు.

About The Author