ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ముగిసిన రీపోలింగ్…
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో నేడు జరిగిన రీ పోలింగ్ లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది వెల్లడించారు.
అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్వివేది వివరాలు వెల్లడించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని కేసానుపల్లిలో 89.23 శాతం పోలింగ్ నమోదైంది, మొత్తం 956 మంది ఓటర్లల్లో 853 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
* నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలోని ఇసుకపాలెం పోలింగ్ కేంద్రంలో 75.55 శాతం పోలింగ్ నమోదైంది మొత్తం 1084 ఓట్లకు గానూ 819 ఓట్లు పోలయ్యాయి.
* గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నల్లచెరువు పోలింగ్ కేంద్రంలో 75.4 శాతం పోలింగ్ నమోదైంది, మొత్తం 1396 మంది ఓటర్లలో 1,053 మంది తమ ఓటును వినియోగించుకొన్నారు.
* ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని కలనూతలలో 75.61 శాతం పోలింగ్ నమోదైంది, మొత్తం 1070 మంది ఓటర్లలో 809 మంది ఓటు వేశారు.
* నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలోని అటకానితిప్పలో 83.15 శాతం పోలింగ్ నమోదైంది, మొత్తం 558 ఓట్లకు గాను 464 ఓట్లు పోలయ్యాయి.