గోధుమగడ్డి రసం ఉపయోగాలు – సంపూర్ణ వివరణ – 2


అంతకు ముందు పోస్టులో గోధుమగడ్డి ఉపయోగాలు మీకు తెలియచేశాను . ఇప్పుడు గోధుమగడ్డిని పెంచేవిధానం , తీసుకునే విధానం తెలియచేస్తాను .

* గోధుమగడ్డి పెంచే విధానం –

ఇంటి యందు ఖాళీ ప్రదేశం ఉన్నవారు దానిని ఏడు భాగాలుగా విడగొట్టటం లేదా పెద్ద వెడల్పాటి కుండీలు లేదా చెక్కపెట్టెలలో గోధుమగడ్డిని పెంచాలి. ఎరువు సహజమైనది అయి ఉండాలి. రసాయనిక ఎరువులను వాడరాదు. మనం పెంచే కుండీ లేదా చెక్కపెట్టె పరిమాణం ఒక స్క్వేర్ ఫీట్ ఉండాలి. 100 గ్రాముల గోధుమగింజలను ప్రతి కుండీలో నాటాలి . సాధారణంగా 100 గ్రా నుండి 120 గ్రా గోధుమగడ్డి మనం నాటినదాని నుండి వస్తుంది.

గోధుమగింజలను నాటే ముందు 12 గంటలపాటు నానబెట్టాలి. వీటిని నీటినుండి తీసి , తడిగా ఉన్న దళసరిగా ఉన్న గుడ్డలో ఉంచాలి. గట్టిగా గుడ్డను మూటకట్టండి. దాని నుంచి మొలకలు వస్తాయి. మొలచిన గోధుమ గింజలను నాటితే గడ్డి యొక్క ఎత్తు వారం రోజులలో 5 నుండి 7 అంగుళాల ఎత్తు పెరుగును . ప్రతి 24 గంటలకు ఒకసారి నీరు చిలకరించండి. కుండీలలో ఎక్కువ నీరు పోయవద్దు. ఇలా పోయడం వలన వాటి పెరుగుదల అడ్డగించబడును. ఇలా 7 కుండీలలో ఒక్కోరోజు నాటండి. మొదటిరోజు నాటబడిన గోధుమ గింజలు గోధుమగడ్డిగా పెరుగును . ఏడొవరోజు నాటికి 7 ఇంచులు ఎత్తుకి పెరుగును . ఈ గోధుమగడ్డిని కత్తెరతో కోయడం లేదా చేతితో తుంచడం చేయండి . కుండీలలో నుండి తీసిన తరువాత మట్టిని తీసి శుభ్రపరిచి ఎండలో పెట్టాలి . మళ్ళీ గోధుమను నాటేప్పుడు కొంచెం సహజ ఎరువును వేయండి . ఒకేసారి ఏడుకుండీలలో నాటవద్దు. ప్రతిరోజూ ఒకదానిలో నాటుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు వాడుకొవచ్చు.

* రసం తీసే విధానం –

గోధుమగడ్డిని కుండీలలో నుంచి తీసిన తరువాత బాగా కడిగి ఆ తరువాత కొంతనీరు కలిపి బాగా రుబ్బాలి. అలా రుబ్బిన గోధుమగడ్డిని ఒక పరిశుభ్రమైన గుడ్డ యందు ఉంచి పిండాలి. అలా వచ్చిన రసాన్ని తీసుకోవాలి . ఎవరైనా రసాన్ని తాగటం ఇష్టం లేకున్న గడ్డిని నమిలి రసాన్ని తీసుకుని పిప్పిని బయటకి వూయవచ్చు. సాధారణంగా 100 గ్రాముల గోధుమగడ్డి నుండి 5 నుంచి 6 ఔన్సుల స్వచ్చమైన రసం మాత్రమే వస్తుంది. నీరు కలిపి రుబ్బటం వలన కొంత మోతాదు పెరుగుతుంది .

* గోధుమగడ్డి రసం తీసుకోవలసిన మోతాదు –

వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి 100 మి.ల్లీ తీసికొనవలెను. కాని ఒకేసారి తీసుకొకూడదు. మొదట 25 మి మి .లీ నుండి ప్రారంభించి 50 మి.లీ అటు తరువాత 100 మి.లీ వరకు పెంచుకుంటూ వెళ్ళాలి. పాత మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు 250 మి.లీ నుంచి 300 మి.లీ వరకు రోజు మొత్తం తీసుకోవాలి. వేడి చేయు గుణం ఉండటం వలన వేడి శరీరం ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది .

గోధుమగడ్డి నుండి రసం తీసినవెంటనే రసాన్ని తీసుకోవాలి . ఒకేసారి మింగకుండా కొంచంకొంచం తీసికొనవలెను . రసాన్ని ఎక్కువసేపు నిలువ ఉంచితే పోషకాలు కోల్పోవును . రసం తాగుటకు గంట ముందు గాని తాగిన గంట వరకు కూడా ఎటువంటివి తినటం గాని తాగటం కాని చేయకూడదు .

* గోధుమగడ్డి రసాన్ని తీసుకునే ముందు గమనించవలసిన విషయం –

గోధుమగడ్డి రసాన్ని మాత్రమే తీసుకోవాలి అనుకునే వారు ఒకటి రెండు రోజుల ముందు నుంచి ఉపవాసం చేయడం లేదా కేవలం పళ్లరసాలను మాత్రమే తీసుకొనవలెను . ఉపవాసం చేసినతరువాత తీసుకుంటే ఒంటికి తొందరగా పడుతుంది. మొదట చిన్న మోతాదులో తీసుకొవడం మొదలుపెట్టి మెల్లగా మోతాదు పెంచుకుంటూ వెళ్లవలెను . కొంతమందికి ఈ రసం తీసుకున్నాక డోకు , వాంతులు , జలుబు , విరేచనాలు , జ్వరం రావొచ్చు . ఇలాంటివి అరుదుగా వస్తాయి. భయపడనవసరం లేదు . అటువంటి సమయాలలో రసానికి మరింత మోతాదు నీరు కలిపి పలుచగా చేసి తీసుకోవాలి . పైన చెప్పిన లక్షణాలు అలానే ఉంటే రసం తీసుకోవడం ఆపేసి తగ్గాక మరలా మొదలుపెట్టండి. రుచి కొరకు ఎటువంటి వస్తువులు కలపకూడదు.

గమనిక –

నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

కాళహస్తి వేంకటేశ్వరరావు

9885030034

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

About The Author