బొప్పాయి గురించి సంపూర్ణ వివరణ – ఉపయోగాలు

ఇది పులుపు , తీపి రుచులతో ఉండి దీని రసం చల్లగా ఉంటుంది. ఇది ఫిబ్రవరి , మార్చి నెలలో మే నుండి అక్టోబర్ నెలలో కాపుకు వస్తుంది. పండు బొప్పాయి కాయ గుండెకు మంచి ఉపయోగకరం . పైత్యాన్ని తగ్గించును . కాలేయానికి ఉపయోగకరం . ప్లీహం పెద్దది అవ్వకుండా కాపాడును . మలబద్ధకాన్ని పోగొట్టును . మూత్రవ్యాధులలో అద్భుతముగా పనిచేయును .

బొప్పాయికాయలో దాదాపు సగం గ్లూకోజ్ , మిగతాసగం ఫ్రక్టోజ్ ఉండును. మామిడికాయ తరువాత విటమిన్ “A ” ఎక్కువ మోతాదులో ఇందులోనే ఉంటుంది. ఇది పక్వానికి వచ్చేకొద్దీ ఇందులో విటమిన్ ” C ” పెరుగును . మే నుండి అక్టోబర్ మధ్యలో వచ్చే బొప్పాయకాయల్లో పంచదార మరియు విటమిన్ ” C ” అధికంగా ఉండును. బొప్పాయకాయలో విటమిన్ B1 , B2 మరియు నియాసిన్ అధికంగా ఉండును.

పచ్చిబొప్పాయకాయ నుండి వచ్చే తెల్లటి సెక్రిపన్ , పాపాయన్ అనే జీర్ణసంబంధమైన ఎంజైము ను కలిగి ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయును . పచ్చి బొప్పాయకాయను రసం రూపంలో తీసికొనవలెను . పండిన కాయను సహజరూపంలోనే తీసుకొనవచ్చు . బొప్పాయి కాయను తీసుకోవడం వలన జీర్ణప్రదేశంలో ఉండే రౌండ్ వార్మ్స్ అనే పురుగులను బయటకి పంపును . ఈ రసం కాలేయవ్యాధులను నయం చేయును . రుతుప్రవాహం సరిగ్గా ఉండటానికి సహాయపడును. రక్తవిరేచనాలు , ఆమ్లత్వం , అజీర్ణం, మలబద్దకం వంటివాటికి చాలా మంచి ఔషధముగా పనిచేయును . రక్తహీనతకు కూడా బాగుగా పనిచేయును .

బొప్పాయి మూత్రం ఎక్కువ అయ్యేలా చేస్తుంది . కావున ఇది మూత్రపిండాల వ్యాధులలో చాలా ఉపయోగకరం . పండిన బొప్పాయి మలబద్దకాన్ని పోగొట్టును . ఆస్తమాకు మంచి ఔషధముగా పనిచేస్తుంది . పచ్చి బొప్పాయికాయలోని తెల్లటి గుజ్జు ముఖంపైన రుద్దుట వలన మొటిమల సమస్య నివారణ అగును. ముఖానికి మంచి వెలుగు తెచ్చును. ముడతలను పోగొట్టును .

బొప్పాయిరసం శరీరంలో వేడిని పెంచును కావున గర్భిణీలు , జ్వరం ఉన్నవారికి బొప్పాయి ఇవ్వకూడదు. బొప్పాయి ఆకులను బోదకాలు నివారణలో వాడతారు.

గమనిక –

నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

కాళహస్తి వేంకటేశ్వరరావు

9885030034

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

About The Author