రౌడీ షీటర్లను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించవద్దండి: జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న

ఈ నెల 23 న సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ కౌంటింగ్ ఏజెంట్లుగా రౌడీ షీటర్లను నియమించరాదని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న సూచించారు.

అభ్యర్థులు తమ కౌంటింగ్ ఏజెంట్లుగా నియామకం కొరకు రౌడీషీటర్ల జాబితాలో లేని వారి పేర్లను ఈనెల 10లోపు సంబందిత పార్లమెంట్, అసెంబ్లీ రిటర్నింగ్ అధికారులకు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

అసెంబ్లీ , పార్లమెంట్ నియోజకవర్గాల కౌంటింగ్ కు రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించేటప్పుడు రౌడీ షీటర్ గా నమోదు కాని వారి పేర్లను మాత్రమే జాబితాతో ఈ నెల 10లోపు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.

About The Author