కేరళ SSC పరీక్షల్లో స్టేట్ టాపర్‌గా నిలిచిన ఈ చిట్టితల్లి ఎవరో తెలుసా….??


జనవరి 18, 2017 న కేరళలోని కన్నూరు జిల్లా, కదంబూర్ గ్రామంలో రాత్రి 11 గంటల సమయంలో #స్వయంసేవక్ సంతోష్ ఇంటిపై #కమ్యూనిష్టు గూండాలు దాడిచేసి ఇంట్లో అందరూ చూస్తుండగానే అతనిని ముక్కలు ముక్కలుగా నరికేశారు..
అప్పట్లో ఈ హత్య పెద్ద సంచలనమై కేరళ ముఖ్యమంత్రి #పినయరాయ_విజయన్‌పై తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది..
కారణం ఆయన స్వంత జిల్లా అయిన కన్నూరులో జాతీయవాదులు బలపడడం ఇష్టంలేక ఆయనే ఈ హత్యకు స్వయంగా పథక రచన చేశాడు..

ఈ పాశవిక హత్యను కళ్ళారా చూసిన అతని 12 ఏళ్ళ కూతురు, అప్పుడు హైస్కులులో 8వ తరగతి చదువుతోంది.. ఆమె పేరు #విస్మయ..
ఆమెను టీవీ ఛానళ్ళ వాళ్ళు ఇంటర్వూ చేసినపుడు ఏడవడం, తిట్టడం, భయపడడం చేయకుండా తన భావాలను ఇలా ఒక కవిత రూపంలో వారికి చెప్పింది:
“నా పేరు విస్మయ..
నేను కదంబూర్ హైస్కులులో 8వ తరగతి చదువుతున్నాను..
నేను డాక్టరునై నా గ్రామస్తులకు ఉచితంగా వైద్యసేవలు చేయాలని మా నాన్న నిత్యం చెప్పేవారు..
నా తండ్రి హ్రృదయంపై నేను తల వాల్చి నిద్రపోయేదాన్ని..
ఈరోజు నా కలలన్నీ కొట్టుకు పోయాయి, నేనిక ఎవరి హ్రృదయంపై తలవాల్చి నిద్రపోవాలి..
నా భవిష్యత్తు అంతా చీకటి మయంగా కనిపిస్తున్నది..
వారు మా నాన్ననే కాదు మా భవిష్యత్తును కూడా చంపివేశారు..
మా తాతగారికి కొడుకును ఎవరు తెచ్చిస్తారు..
మా నాన్న చేసిన తప్పేంటి..??
ఒక జాతీయవాదిగా దేశాన్ని ప్రేమించడం నాన్న చేసిన తప్పా..??
అందుకే చంపేస్తారా..??
రక్తంతో తడిచిన మా ఇంటినీ, ధారాపాతంగా మా కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్ళనూ చూసి వారు ఆనందిస్తున్నారా..??
అంటూ ఆమె తన భావాలను ఆ 12 ఏళ్ళ వయస్సులోనే మీడియా ముందు వచ్చీరాని కవిత రూపంలో వెల్లడించారు….!!

About The Author