ఈ పెద్దాయనకు భగవంతుడు ఇచ్చిన వరమో లేక వాళ్ళ పూర్వీకులు చేసిన పుణ్యఫలితమోగాని…


ఈ ఫొటోలో ఉన్న పెద్దాయన పేరు వెంకటరంగా రెడ్డి, రెడ్డిపల్లి గ్రామం,రొద్దం మండలం. ఈ పెద్దాయనకు భగవంతుడు ఇచ్చిన వరమో లేక వాళ్ళ పూర్వీకులు చేసిన పుణ్యఫలితమోగాని అధ్బుతమైన శక్తి ఉంది, అదేమంటే మా ప్రాంతంలో యెవ్వరు బోరు వేయాలన్నా ఇతనినే సంప్రదించి వెంట తీసుకెళ్ళి ఇతను చెప్పిన చోటే బోరు వేయిస్తారు, ఇతనేమీ పెద్దగా చదువుకోలేదు కానీ శాస్త్రవేత్తలు కూడా చెప్పలేని విషయాలని కూలంకుషంగా వివరిస్తారు. రైతు పొలం లో అడుగు పెట్టిన వెంటనే భూమి పొరల గురించి నీళ్ళు ఎంత లోతులో ఉన్నది,ఎంతమేరకు ఉన్నది, కేసింగ్ ఎన్ని అడుగులమేర అవసరమౌతుందో సదరు రైతుకు అవగాహన కల్పిస్తాడు, మా ప్రాంతంలో పది బోర్లు వేసి నష్ట పోయిన రైతు పొలంలో కూడా పాతాళ గంగను పైకి తేగల సమర్థుడు మా రంగారెడ్డి అన్న అని సగటు మధ్యతరగతి రైతులందరూ కాలర్ ఎగరేసి మరీ చెప్పుకొంటారు. కాని పెద్దాయన ఇంతవరకు వేలాది మంది రైతులకు తన సేవలు ఉచితంగానే అందిస్తున్నాడు, ఇచ్చినా తీసుకోడు, పేద రైతులైతే తన బైక్ మీదే వెళ్ళి వాళ్ళకు పాయింట్ చూయించి బోర్ వెల్ యేజెన్సీతో మాట్లాడి రాయితీ కూడా ఇప్పిస్తాడు, కావున మన రైతు సోదరులు ఇతని సేవలను అవసరమనిమిస్తే ఉపయోగించుకోగలరనిమనవి….

About The Author