ఏపీ సహ కమీషనర్ గా ఐలాపురం రాజా…

ఏపీ సహ కమీషనర్ గా ఐలాపురం రాజా… ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరిలో ఒక్కరినే ఆమోదించిన గవర్నర్…?

రాష్ట్ర సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్‌గా ఐలాపురం రాజా ను నియమిస్తూ… అందుకు సంబంధించిన ఫైలుకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆర్టీఐ కమిషనర్లుగా ఇద్దరి నియామకాన్ని సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు ఫైల్‌ పంపింది. ఇందులో రాజా పేరుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయగా..‌. సామాజ సేవకుడిగా శ్రీరామమూర్తి పేరును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఫైల్‌లో పంపినా.. ఆయన చేసిన సామాజిక సేవ ఏంటో చెప్పాలని గవర్నర్‌ అడిగినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి రాజా ఒక్కరికే ఆమోదం లభించింది.

విజయవాడలోని వీఆర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన రాజా, అమెరికాలోని న్యూహాంప్ షైర్‌ కాలేజీ నుంచి ఎంబీఏ పట్టాపొందారు.
తన తండ్రి స్థాపించిన ‘హోటల్‌ ఐలాపురం’ నిర్వహణలో తండ్రికి తోడుగా ఉంటూ… ‘ఐలాపురం సేవా సమితి’ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

‘ది కుమ్మర శాలివాహన కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌’ ఏర్పాటు, నిర్వహణలోనూ చురుకైన పాత్ర పోషించిన రాజా, గతంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ), భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) సభ్యునిగా కూడా పని చేశారు.

About The Author