విచారణకు హాజరు కాని రవిప్రకాష్, శివాజి…


విచారణకు హాజరు కాని రవిప్రకాష్, శివాజి… ఆలస్యమైనా విచారణకు హాజరైన సీఎఫ్‌ఓ మూర్తి…

టీవీ9 లో ఎర్పడ్డ యాజమాన్య తగాదా… రోడ్డున పడ్డ సంగతి తెలిసిందే… ఈ క్రమంలో టీవీ9 ను టేకోవర్ చేసిన అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు ఆధారంగా, సంస్థ సీఈవో రవిప్రకాష్ పై ఫోర్జరీ, మోసం తదితర కేసులను, సైబర్ క్రైం పోలీసులు నమోదు చేసారు. విచారణకు హాజరు కావాలంటూ రవిప్రకాష్,శివాజీ, సంస్థ సీఎఫ్ఓ మూర్తి లకు నోటీసులు జారీ చేస్తూ… నేటి ఉదయం 11గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. అయితే రవి ప్రకాష్, శివాజీ లనుంచి ఎటువంటి సమాచారం లేకపోగా కాస్త ఆలస్యంగా మూర్తి విచారణకు హాజరయ్యారు.

విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చినా హాజరు కాకపోవడం, కనీసం సమాచారాన్ని కూడా ఇవ్వకపోవడం పై ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేసారు సైబర్ క్రైం అధికారులు, వారి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు సయబర్ క్రైం పోలీసులు.

రవిప్రకాష్ పై వివిధ సెక్షన్ల క్రింద పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను ఓ సారి పరిశీలిస్తే…

IPC 406….Criminal breach of trust….నమ్మకద్రోహం….3ఏళ్ల వరకు శిక్ష లేదా ఫైన్ లేదా తీవ్రత ను బట్టి రెండూ విధించే అవకాశం

420…Cheating…మోసం… ఇది నాన్ బెయిలబుల్…. దీని క్రింద గరిష్ఠంగా 7 సంవత్సరాల వరకు శిక్ష పడవచ్చు..

467.. ఫోర్జరీ …. ఇది కూడా నాన్ బెయిలబుల్…. ఈ సెక్షన్ క్రింద కేసువ ఋజువు అయితే… పది సంవత్సరాలు లేక గరిష్ఠంగా జీవిత ఖైదు పడవచ్చు…

469… ఇది కూడా ఫోర్జరీ నే కానీ దాని ద్వారా అవతలి వ్యక్తి పరువుని, పేరుని దెబ్బ తీసేందుకు దోహదపడితే ఫైన్ లేదా 3 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం

471…ఫోర్జరీ చేయబడ్డ దస్త్రాలను అసలైనవి గా నమ్మించి మోసం చేయడం..దీనిని కూడా ఫోర్జరీ నేరం గానే పరిగణనలోకి తీసుకుని శిక్ష విధిస్తారు

120(B)..కుట్ర….
కుట్ర పూరిత చర్య వల్ల కలిగే నష్ట తీవ్రత ను బట్టి శిక్ష కాలాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది…

IT Act 66…కంప్యూటర్ లలో ఉన్న కీలకమైన సమాచారాన్ని హాక్ చేయడం..లేదా దొంగిలించడం…. ఈ నెరం ఋజువైతే… గరిష్ఠంగా 3ఏళ్ల వరకు శిక్ష లేదా 2లక్షల రూపాయల జరిమానా లేక రెండూ విదించ వచ్చు…

Sec..72….వ్యక్తి అనుమతి లేకుండా కీలకమైన వ్యకిగత సమాచార గోప్యత కు భంగం కలిగించడం…… ఈ సెక్షన్ క్రింద నెరం నిరుపించబడితే… గరిష్ఠంగా 2 ఏళ్ళ వరకు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేక రెండూ విధించ వచ్చు

About The Author