క్యూలైన్ లో నిలబడి ఓటు వేసిన దేశ ప్రథమ పౌరుడు…
2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు జరుగుతున్న ఆరో దశ పోలింగ్‌లో.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన సతీమణి సవితా కోవింద్‌తో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్రపతి భవన సముదాయంలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. తన సతీమణి సవితా కోవింద్‌తో కలిసి పోలింగ్ బూత్‌కి వెళ్లిన ఆయన… అందరితో పాటు క్యూలైన్‌లో నిలబడి ఓటు వేయడం విశేషం.
ఆరోదశ లోక్‌సభ ఎన్నికల్లో ఈరోజు మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. యూపీలో 14, హర్యానాలో 10, పశ్చిమ బెంగాల్ లో 08, మధ్యప్రదేశ్ లో 8, బిహార్ లో 8, ఢిల్లీలోని 7, జార్ఖండ్ లోని 4 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.