ఆయుర్వేదం నందు వివరించబడిన ఆరోగ్య సూత్రాలు – 1

* ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తము నందు నిద్రనుంచి మేల్కొనవలెను .

* సూర్యోదయానికి మునుపే సుమారు 20 ఔన్సుల ( 592 ml ) కుండ యందు గల నీటిని సేవించవలెను . ఈ విధానం వలన ముసలితనం త్వరగా రాదు .

* తెల్లవారుజామునే మలమూత్ర విసర్జన చేయవలెను . మలమూత్రాలు విసర్జించాలని సూచన కలిగినప్పుడే విసర్జించవలెను . ఆలోచన వేరే చోట ఉంచి విసర్జించరాదు. మలమూత్ర వేగాన్ని నియంత్రించకూడదు. తెల్లవారుజామునే మలమూత్ర విసర్జన వలన ఆయుర్దాయం పెరుగును .

* ముక్కిముక్కి బలవంతముగా మలవిసర్జన చేయుట వలన తలనొప్పి , నరాల బలహీనత , రొమ్ము నొప్పి, మూలవ్యాధి మొదలగు రోగాలు కలగవచ్చు . అపానవాయువు విడువకుండా బందించుట మూలాన కడుపుబ్బరం , కడుపునొప్పి వచ్చును.

* ఉదయాన్నే మరియు సాయంకాలం చేదు , వగరు , కారం రుచులు కలిగినటువంటి మర్రి, వేగిస,జిల్లేడు , చండ్ర, కానుగ, గన్నేరు , గుగ్గిలం , తుమ్మ, ఉత్తరేణి , జాజి , మద్ది చెట్ల వేర్లు గాని లేదా పైన చెప్పిన చెట్ల కొమ్మలనుగాని బాగా నమిలి కుంచలా ( బ్రష్ ) చేసుకుని చెంగల్వకోష్టు , కరక్కాయ వొలుపు , తాండ్రకాయ వొలుపు , ఉశిరికాయ వొలుపు , యాలకలు , దాల్చినచెక్క , లవంగపత్రి , మిరియాలు , శొంటి , పిప్పిళ్లు అన్నింటిని సమపాళ్లలో తీసుకుని మెత్తటి పొడి చేసి దానిలో కావలసినంత తేనె కలిపి పైన చెప్పిన కుంచెకు అద్ది చిగుళ్లకు గుచ్చుకోకుండా మౌనంగా దంతధావనం చేసుకొనవలెను . తేనె ఉపయోగించకుండా చూర్ణం కూడా వాడవచ్చు . దీనివలన దంతసంబంధ సమస్యలు నశించి , పళ్లు గట్టిపడును.

* గట్టిగా ఉండు ఆహారపదార్థాలు కొరికి తినడం , తీపి పదార్థాలు ఎక్కువ తినడం , మరీ చల్లగా , మరీ వేడిగా ఉండు ద్రవపదార్థాలు తీసుకోవడం , ఎక్కువ సార్లు తాంబూలం వేసుకోవడం , పగలు నిద్రించడం , రాత్రి భుజించిన వెంటనే పడుకోవడం , తలగడ లేకుండా పడుకోవడం , రాత్రి సమయం నందు త్వరగా భుజించకపోవడం వంటివి దంతరోగాలు రావడానికి ప్రధాన కారణం .

* అజీర్ణం , వాంతి, ఉబ్బసం , దగ్గు , జ్వరం , వాతం వలన మూతి వంకరగా పోవు వ్యాధి , దప్పికతో బాధపడువారు , నోటిపుండు , హృదయ సంబంధ రోగాలు కలవారు , కండ్ల జబ్బులు , తలకు సంబంధించిన వ్యాధులు , చెవికి సంబంధించిన వ్యాధులు కలవారు దంతధావనం కొరకు పుల్లను వాడకూడదు.

* బంగారం , వెండి, రాగి , సీసం , ఇత్తడి వంటి లోహాలతో పదునుగా కాకుండా మృదువుగా ఉండే విధముగా నాలిక గీయుటకు బద్దను తయారుచేసుకోవలెను . దీంతో నాలిక మొదటి బాగంలో యుండు ఊపిరిని గూడా అడ్డగించు దుర్గన్ధపూరితమైన కళ్లే బయటకి వెల్లునట్లు గీచుకొనవలెను .

* చన్నీళ్లతో నోరు పుక్కిలించడం చేత నోటిలోని కఫం , మాలిన్యం పోవును . నోరు శుభ్రం అగును. దప్పిక తగ్గును. గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వలన కఫము , రుచిలేకుండా ఉండుట , మాలిన్యం , దంతములు మొద్దుబారుట వంటి సమస్యలు పోవును . నోటికి తేటదనం వచ్చును.

* చన్నీళ్లతో ముఖం కడుక్కోవడం వలన నోరు , ముక్కు మొదలయిన వాటి నుండి రక్తం కారటం నిలుచును . ముఖములో ఏర్పడు మంగు పోతుంది .

* గోరువెచ్చటి నీటితో ముఖము కడుగుట వలన ముఖం శుభ్రపడును . జలుబు , ముఖం భారంగా ఉండటం పోయి ముఖమునకు తేటదనం , నునుపుదనం వచ్చును.

* ప్రతినిత్యం “అణుతైలం ” ప్రతి ముక్కు రంద్రములో రెండు చుక్కల వంతున వేసుకొని లోపలికి పీల్చాలి . దీనివలన మనిషికి కాంతివంతమైన చర్మం , ఎత్తైన భుజాలు , లావైన మెడ , అందమైన ముఖం , విశాలమైన రొమ్ము , సువాసన కలిగిన నోరు , ఇంపైన స్వరం కలుగును. జ్ఞానేంద్రియాలకు చురుకుదనం వస్తుంది. ముసలితనం త్వరగా రాదు . తలవెంట్రుకలు తెల్లబడటం , మంగు ఏర్పడదు. అణుతైలాన్ని ముక్కులలో వేసుకొని పీల్చడం వలన చాలారోజుల నుంచి బాధించు తలనొప్పి తగ్గును. అణుతైలం దొరకనప్పుడు కల్తీలేని స్వచ్చమైన నువ్వులనూనె వాడవచ్చు .

తరవాతి పోస్టులో మరిన్ని విషయాలు వివరిస్తాను .

గమనిక –

నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

కాళహస్తి వేంకటేశ్వరరావు

9885030034

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

About The Author